హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Pawan Kalyan : గాడ్ ఫాదర్‌ సెట్లో భీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్ మూవీ సెట్లో చిరంజీవి..

Chiranjeevi - Pawan Kalyan : గాడ్ ఫాదర్‌ సెట్లో భీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్ మూవీ సెట్లో చిరంజీవి..

గాడ్ ఫాదర్‌తో భీమ్లా నాయక్ (File/Photo)

గాడ్ ఫాదర్‌తో భీమ్లా నాయక్ (File/Photo)

Chiranjeevi - Pawan Kalyan : గాడ్ ఫాదర్‌ సెట్లో భీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్ మూవీ సెట్లో చిరంజీవి.. అవును మెగా బ్రదర్స్ అయిన వీళ్లిద్దరు ఒకరి మూవీ షూటింగ్‌లో మరొకరు విజిట్ చేశారు.

  Chiranjeevi - Pawan Kalyan : గాడ్ ఫాదర్‌ సెట్లో భీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్ మూవీ సెట్లో చిరంజీవి.. అవును మెగా బ్రదర్స్ అయిన వీళ్లిద్దరు ఒకరి మూవీ షూటింగ్‌లో మరొకరు విజిట్ చేశారు. మెగాస్టార్  చిరంజీవి హీరోగా నటిస్తోన్నసినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా ’గాడ్ ఫాదర్’ సెట్‌ను పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ యూనిట్‌ మెంబర్స్ రానా, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్రతో కలిసి  విజిట్ చేశారు. ఈ సెట్‌లో చిరంజీవి.. ఖైదీ వేషంలో ఉన్నారు. అది కూడా కలిసొచ్చిన ఖైదీ నంబర్ 786’ డ్రెస్ నే వేసుకున్నారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ మూవీని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు.

  మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ కూడా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. వీళ్లిద్దరు యాదృచ్ఛికంగా మలయాళంలో హిట్టైన సినిమాలను రీమేక్ చేయడం విశేషం. భీమ్లా నాయక్ చిత్ర యూనిట్.. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సెట్ ను సందర్శించిన తర్వాత చిరంజీవి.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ చిత్ర యూనిట్‌ను సందర్శించారు. మెగా బ్రదర్స్.. ఒక సినిమా సెట్‌ను మరొకరు విజిట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు.

  ఇక చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా తన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు అన్న ప్రజా రాజ్యం పార్టీ పెడితే.. అదే అర్ధం ధ్వనించేలా పవన్.. జనసేన పార్టీని పెట్టి ఏపీ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక వీళ్లిద్దరు కలిసి ‘శంకర్ దాదా జిందాబాద్’లో నటించారు. ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో ఒక పాటలో పవన్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం కొసమెరుపు.

  RRR - Ukraine : ఆర్ఆర్ఆర్‌ సహా ఉక్రెయిన్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ భారతీయ సినిమాలు తెలుసా..

  ఇకపవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’  చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. తతెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ (KTR), తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై బెస్ట్ విషెస్ తెలియజేసారు.  ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  Pawan Kalyan Remakes : భీమ్లా నాయక్ సహా పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

  త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు.మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేసి తెరకెక్కించారు. ఇప్పటికే అమెరికాలో  అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ తీరా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడం.. మరోవైపు హిందీ వెర్షన్  టీజర్, ట్రైలర్ లాంటివి విడుదల చేయలేదు. అందుకే ‘భీమ్లా నాయక్’ హిందీ వెర్షన్‌ను ఒక వారం ఆలస్యంగా అక్కడ థియేటర్స్‌లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Chiranjeevi, God father, Pawan kalyan, Ram Charan, Tollywood

  ఉత్తమ కథలు