ఇప్పటి వరకు కూడా అభిమానులకు ఇవే అనుమానాలు ఉండేవి. చిరంజీవి వరస సినిమాలు చేస్తున్నా కూడా మళ్లీ రాజకీయాల వైపు వస్తాడా అనే అనుమానం ఎక్కడో ఓ మూలన అయితే అలాగే ఉండిపోయింది అభిమానులకు. కానీ ఒకేఒక్క మాటతో అన్నీ క్లియర్ చేసాడు మెగాస్టార్ చిరంజీవి. ఇకపై తాను కేవలం మెగాస్టార్ మాత్రమే అని.. రాజకీయాల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని చెప్పేసాడు. కానీ ఈయన చుట్టూ కొందరు మాత్రం చిరంజీవిని మళ్లీ రాజకీయాల వైపు తీసుకురావాలని చూస్తున్నారు. ఆ మధ్య ఓ జాతీయ పార్టీ చిరంజీవి కోసం ప్రయత్నించిందని.. రాజ్యసభ సీట్ ఇవ్వడానికి కూడా చూసిందనే వార్తలు వచ్చాయి. మరోవైపు ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేనతో కలిసి చిరు పని చేస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్స్తోనే అభిమానులు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో అసలైన కబురు చెప్పాడు చిరంజీవి. తనకు ప్రస్తుతం సినిమాలు తప్ప మరో లోకం లేదంటున్నాడు ఈయన. తమ్ముడు జనసేన పార్టీతో కలిసే ముచ్చట్లు కూడా లేవని తేల్చేసాడు. తాజాగా సమంత అక్కినేని స్యామ్ జామ్ షోకు వచ్చిన చిరంజీవి అక్కడ రాజకీయాలపై కుండ బద్ధలు కొట్టేసాడు.
రాజకీయాల్లోకి వెళ్లి 10 సంవత్సరాలలో చాలా తెలుసుకున్నానని.. పాలిటిక్స్ తనకు సెట్ అవ్వవని అర్థమైపోయిందని చెప్పాడు మెగాస్టార్. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన చిరు.. ఇకపై రాజకీయాల జోలికి పోనని కన్ఫర్మ్ చేసాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నటుడిగానే పుట్టాలని ఉందని చెప్పుకొచ్చాడు. మరోవైపు తమ్ముడు జనసేన పార్టీ గురించి చెప్పాడు చిరు. తమ్ముడి కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందని.. కచ్చితంగా ఆయన విజయం సాధిస్తాడని నమ్ముతున్నాడు చిరు.
మరోవైపు ఇతర పార్టీలు కూడా తనను పిలుస్తున్నాయని.. అయితే అది కేవలం వాళ్ల ఆశ, అభిలాష మాత్రమే అంటున్నాడు. తాను మాత్రం ఇప్పుడు సినిమాలతోనే కాలం గడిపేస్తానని.. రాజకీయాలు ఇక చాలు అంటున్నాడు. పదేళ్ల పాటు అక్కడ పడ్డ కష్టాలతో చిరు మనసు పూర్తిగా విరిగిపోయింది. అందుకే ఆయన రాజకీయాలంటేనే ఇప్పుడు నో అంటున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య.. మెహర్ రమేష్ వేదాళం రీమేక్.. జయం రాజా లూసీఫర్ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Samantha akkineni, Telugu Cinema, Tollywood