అవును నలబై ఏళ్లకు పైగా కొనసాగుతున్న చిరంజీవి సినీ కెరీర్లో సాధ్యం కానిది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం సాధ్యం అయింది. అది చూసి చిరంజీవి ఆనందపడిపోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి తన కెరీర్లో తమిళం, హిందీ,మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసాడు. ఎన్ని సినిమాలు రీమేక్ చేసినా.. బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ పాత్రలో మాత్రం నటించలేదు. ఇక బిగ్‌బీ నటించిన ‘ముఖద్దర్ కా సికిందర్’ తెలుగు రీమేక్ ‘ప్రేమ తరంగాలు’ సినిమాలో చిరు నటించినా.. అందులో అమితాబ్ బచ్చన్ పాత్ర కాకుండా.. వినోద్ ఖన్నా క్యారెక్టర్‌ను తెలుగులో చేసాడు చిరు. అటు చిరంజీవి హీరోగా నటించిన ‘చట్టానికి కళ్లులేవు’ సినిమా హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ నటించినా.. చిరంజీవి నటించిన పాత్రలో అమితాబ్ బచ్చన్ చేయలేదు. ఈ రకంగా చిరంజీవి హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన ఏ పాత్రను తెలుగులో చేయలేకపోయాడు. కానీ వీళ్లిద్దరు తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.
అదే రామ్ చరణ్ విషయానికొస్తే.. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ సినిమాను హిందీలో అదే టైటిల్‌తో ‘జంజీర్’గా రీమేక్ చేసాడు. బిగ్‌బీ చేసిన పాత్రను హిందీలో తాను పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇక అప్పట్లో అమితాబ్ ‘జంజీర్’ సినిమాను అన్నగారైన ఎన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’గా రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. తన సినీ కెరీర్లో ఎన్నో రీమేక్‌లు చేసిన పవర్ స్టార్.. అమితాబ్ బచ్చన్ నటించిన ఏ సినిమా రీమేక్ చేయలేదు. కానీ ఇపుడు హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ రకంగా చిరంజీవికి తన సినీ కెరీర్ మొత్తంలో అమితాబ్ బచ్చన్ చేసిన ఏ పాత్రను తెలుగులో చేయలేకపోయాడు. అదే ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ మాత్రం అమితాబ్ పాత్రలో నటించాడు. మరో హీరో పవన్ కళ్యాణ్.. బిగ్ బీ పాత్రలో నటించడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Chiranjeevi, Pawan kalyan, Ram Charan, Telugu Cinema, Tollywood, Vakeel Saab