అవును నలబై ఏళ్లకు పైగా కొనసాగుతున్న చిరంజీవి సినీ కెరీర్లో చేయలేనిది రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం చేసి చూపించారు. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి తన ఫిల్మీ కెరీర్లో తమిళం, హిందీ,మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్స్‌తో పాటు కొన్ని ఫ్లాపులను కూడా అందుకున్నాడు. ఎన్ని సినిమాలు రీమేక్ చేసినా.. బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన ఏ పాత్రలో మాత్రం నటించలేదు. ఇక బిగ్‌బీ నటించిన ‘ముఖద్దర్ కా సికిందర్’ తెలుగు రీమేక్ ‘ప్రేమ తరంగాలు’ సినిమాలో చిరు నటించినా.. అందులో అమితాబ్ బచ్చన్ పాత్ర కాకుండా.. వినోద్ ఖన్నా క్యారెక్టర్‌ను తెలుగులో చేసాడు చిరు. అటు చిరంజీవి హీరోగా నటించిన ‘చట్టానికి కళ్లులేవు’ సినిమా హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ నటించినా.. చిరంజీవి నటించిన పాత్రలో అమితాబ్ బచ్చన్ చేయలేదు. ఈ రకంగా చిరంజీవి హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన ఏ పాత్రను తెలుగులో చేయలేకపోయాడు. కానీ హిందీలో చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌ను తెలుగులో చిరంజీవి ఒక సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. అంతే తప్పించి వెండితెరపై అమితాబ్ చేసిన ఏ పాత్రను చిరు చేయలేదు. కానీ వీళ్లిద్దరు తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

అమితాబ్, చిరు,పవన్,రామ్ చరణ్(Twitter/Photo)
అదే రామ్ చరణ్ విషయానికొస్తే.. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ సినిమాను హిందీలో అదే టైటిల్‌తో ‘జంజీర్’గా రీమేక్ చేసాడు. బిగ్‌బీ చేసిన పాత్రను హిందీలో తాను పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇక అప్పట్లో అమితాబ్ ‘జంజీర్’ సినిమాను అన్నగారైన ఎన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’గా రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

జంజీర్ మూవీ (యూట్యూబ్ క్రెడిట్)
ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. తన సినీ కెరీర్లో ఎన్నో రీమేక్‌లు చేసిన పవర్ స్టార్.. అమితాబ్ బచ్చన్ నటించిన ఏ సినిమా రీమేక్ చేయలేదు. కానీ ఇపుడు హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ రద్దు చేసారు. అందులో ఈ సినిమా కూడా ఉంది. వీలైతే.. ఈ యేడాది చివర్లో కానీ.. నెక్ట్స్ ఇయర్ ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

అమితాబ్ బచ్చన్ పింక్ రీమేక్ వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ (Fan Made Twitter/Photo)
ఈ రకంగా చిరంజీవికి తన సినీ కెరీర్ మొత్తంలో అమితాబ్ బచ్చన్ చేసిన ఏ పాత్రను తెలుగులో చేయలేకపోయాడు. అదే ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ మాత్రం అమితాబ్ పాత్రలో నటించాడు. మరో హీరో పవన్ కళ్యాణ్.. త్వరలో బిగ్ బీ పాత్రలో కనిపించబోవడం విశేషం.
Published by:Kiran Kumar Thanjavur
First published:August 14, 2020, 15:11 IST