పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్.. వామ్మో ఇంకేమైనా ఉందా...?

ఏం మాట్లాడుతున్నారు.. తమ్ముడు సినిమాలో అన్నయ్య విలన్ ఏంటి అనుకుంటున్నారా..? ఎక్కడ్నుంచి వచ్చింది ఈ వార్త అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 2:05 PM IST
పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్.. వామ్మో ఇంకేమైనా ఉందా...?
పవన్ కళ్యాణ్, చిరంజీవి
  • Share this:
ఏం మాట్లాడుతున్నారు.. తమ్ముడు సినిమాలో అన్నయ్య విలన్ ఏంటి అనుకుంటున్నారా..? ఎక్కడ్నుంచి వచ్చింది ఈ వార్త అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇది ఇప్పటి విషయం కాదు.. కొన్నేళ్ల కింద జరిగిన కథ. ఈ కథలోకి వెళ్లాలంటే ముందు మళయాలంలో మెగాస్టార్ అయిన మమ్ముట్టిని కూడా కథలోకి తీసుకుని రావాలి. అప్పట్లో ఈయన స్వాతికిరణం లాంటి సినిమాలు చేసాడు.. ఆ తర్వాత ఈ మధ్యే యాత్ర సినిమాలో నటించాడు. ప్రస్తుతం మమాంగం అనే సినిమాలో నటించాడు మమ్ముట్టి. పూర్తిగా కేరళ యుద్ధ విద్యలపై తెరకెక్కిన సినిమా ఇది.
Chiranjeevi negative role in Pawan Kalyan movie and Allu Aravind shared a superb experience pk ఏం మాట్లాడుతున్నారు.. తమ్ముడు సినిమాలో అన్నయ్య విలన్ ఏంటి అనుకుంటున్నారా..? ఎక్కడ్నుంచి వచ్చింది ఈ వార్త అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi pawan kalyan,chiranjeevi pawan kalyan movie,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi allu aravind,pawan kalyan allu aravind,telugu cinema,పవన్ కల్యాణ్,చిరంజీవి,పవన్ కల్యాణ్ చిరంజీవి,పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్
పవన్ కళ్యాణ్, చిరంజీవి

ఈ మధ్యే ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం హైదరబాద్ వచ్చాడు మమ్ముట్టి. అక్కడ ఆసక్తికరమైన కథనం ఒకటి జరిగింది. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చాడు అల్లు అరవింద్. ఆ సినిమా హీరో మమ్ముట్టి గురించి చెబుతూ.. కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనను కూడా గుర్తు చేసుకున్నాడు అల్లు అరవింద్. కొన్నేళ్ల కింద తాను పవన్‌తో సినిమాను నిర్మించాలనుకున్నానని.. అందులో ప్రతినాయక పాత్ర కోసం మమ్ముట్టిని అడిగితే ఆయన సీరియస్ అయ్యాడని కూడా చెప్పాడు. మమ్ముట్టి దీనికి సమాధానం ఇస్తూ ఒకవేళ పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్‌గా నటిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఊహించుకోండి అన్నారని చెప్పాడు.

Chiranjeevi negative role in Pawan Kalyan movie and Allu Aravind shared a superb experience pk ఏం మాట్లాడుతున్నారు.. తమ్ముడు సినిమాలో అన్నయ్య విలన్ ఏంటి అనుకుంటున్నారా..? ఎక్కడ్నుంచి వచ్చింది ఈ వార్త అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. chiranjeevi,chiranjeevi facebook,chiranjeevi pawan kalyan,chiranjeevi pawan kalyan movie,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi allu aravind,pawan kalyan allu aravind,telugu cinema,పవన్ కల్యాణ్,చిరంజీవి,పవన్ కల్యాణ్ చిరంజీవి,పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్
చిరంజీవి పవన్ కల్యాణ్ (Source: Twitter)

ఇంతే ధైర్యంగా చిరంజీవిని అడుగుతారా అంటే అల్లు అరవింద్ నవ్వి ఊరుకున్నాడు. కానీ ఒక్కసారి నిజంగానే ఊహించుకోండి.. పవన్ సినిమాలో చిరంజీవి విలన్ అయితే వామ్మో కనీసం ఊహలోకి కూడా అది వస్తే భయమేస్తుంది కదా..? మమ్ముట్టి అలాంటి సంచలన సమాధానం చెప్పేసరికి అల్లు అరవింద్ కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. అయితే దానికి ముందు ప్రస్థానం సినిమాలో కూడా సాయికుమార్ పాత్ర కోసం మమ్ముట్టిని అడిగితే అక్కడ కూడా ఆయన సీరియస్ అయ్యాడు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>