• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • CHIRANJEEVI NBK PSPK DIL RAJU TO PRODUCE VAKEEL SAAB MOVIE WITH PAWAN KALAYN AND HIS NEXT TARGET TOLLYWOOD TOP SENIOR HEROES BALAKRISHNA CHIRANJEEVI HERE ARE THE DETAILS TA

Chiranjeevi - NBK - PSPK: పవన్ కళ్యాణ్ తర్వాత అతని టార్గెట్.. చిరంజీవి, బాలకృష్ణనేనా..

చిరంజీవి,బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ (File/Photos)

Chiranjeevi - NBK - PSPK: అవును పవన్ కళ్యాణ్ అయిపోయాడు. ఇపుడా ఆయన టార్గెట్ తెలుగు సీనియర్ హీరోలైనా బాలకృష్ణ, చిరంజీవి మిగిలారు. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Chiranjeevi - NBK - PSPK: అవును పవన్ కళ్యాణ్ అయిపోయాడు. ఇపుడా ఆయన టార్గెట్ తెలుగు సీనియర్ హీరోలైనా బాలకృష్ణ, చిరంజీవి మిగిలారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా దిల్ రాజు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ తన కెరీర్‌లోనే మొదటిసారి వకీల్ సాబ్ పాత్రలో అభిమానులను కనువిందు చేయనున్నారు.

    పవన్ కళ్యాణ్‌తో నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంతో దిల్ రాజు ప్రస్తుతం తెలుగు యంగ్ హీరోలందరితో సినిమాలను తెరకెక్కించిన నిర్మాతగా రికార్డులకు ఎక్కాడు. వకీల్ సాబ్ విషయానికొస్తే.. ఈ చిత్రం హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్. తమిళంలో ఈ చిత్రాన్ని అజిత్ హీరోగా ’నేర్కొండ పార్వాయి’గా తెరకెక్కిస్తే మంచి సక్సెస్ సాధించింది.  హిందీలో తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరో ముఖ్యపాత్రల్లో హీరోయిన్ అంజలి, నివేదా థామస్ యాక్ట్ చేస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన పింక్‌ను తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాడు.

    pawan kalyan, powe star pawan kalyan, vakeel saab, vakeel saab release date, vakeel saab on April 9th, anjali, nivetha thomas, ananya nagalla, dil raju, boney kapoor, shruti haasan
    వకీల్ సాబ్ మూవీ (Twitter/Photo)


    ఆ సంగతి పక్కన పెడితే..  సీనియర్ టాప్ హీరోలైన వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్2’ సినిమాలను తెరకెక్కించాడు నిర్మాత దిల్ రాజు. మరోవైపు నాగార్జునతో కూడా ‘గగనం’ సినిమాను తీసిన ట్రాక్ రికార్డు  దిల్ రాజు సొంతం. ఇక  బడా ప్రొడ్యూసర్ లిస్టులో తెలుగులో అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవి మాత్రమే మిగిలారు.  ఇపుడు ఆ లోటును వీళ్లతో సినిమాలు తెరకెక్కించి తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట.

    Megastar Chiranjeevi Balakrishna Nandamuri NBK Balayya Acharya BB3 Vakeel Saab Power Star Pawan Kalyan News18
    పవన్ కళ్యాణ్,బాలకృష్ణ,చిరంజీవి (File/Photos)


    ఇప్పటికే దిల్ రాజు ఈ హీరోల ఇమేజ్ తగ్గ కథలను రెడీ చేయించే పనిలో ఉన్నట్టు సమాచారం.  వీళ్లతో సినిమాలు తీస్తే.. తెలుగు ఇండస్ట్రీలో అందరు అగ్ర హీరోలతో సినిమాలు తెరకెక్కించిన నిర్మాతగా దిల్ రాజు పేరు రికార్డులకు ఎక్కుతుంది.  మొత్తానికి దిల్ రాజు టాలీవుడ్  అగ్ర హీరోలందరితో సినిమాలు తెరకెక్కించేందుకు మంచి ప్లానింగ్‌తో ఉన్నట్టు తెలుస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: