CHIRANJEEVI NAYANTHARA REJECTED CHIRANJEEVI LUCIFER REMAKE OFFER THESE ARE THE REASON TA
Chiranjeevi - Nayanthara: చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన నయనతార.. మెగాస్టార్ డైలమా..
చిరంజీవి,నయనతార (File/Photo)
Chiranjeevi - Nayanthara | చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన నయనతార. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
Chiranjeevi - Nayanthara | చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన నయనతార. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకోవైపు ఈ సినిమాను మే 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆచార్య’ తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ ‘వేదాళం’ సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక లూసీఫర్ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎంతో మందిని అనుకోని చివరకు తమిళంలో ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తెలుగువాడైన మోహన్ రాజాకు అప్పగించాడు.
మలయాళంలో కథ ప్రకారం హీరోయిన్ లేదు. కానీ తెలుగులో మాత్రం చిరు ఇమేజ్‌కు తగ్గట్టు హీరోయిన్ పాత్రను డిజైన్ చేసారట. అంతేకాదు ఈ క్యారెక్టర్ కోసం నయనతారను సంప్రదించారట. కానీ నయనతార ఈ సినిమాలో సినిమాలో తన పాత్రకు అంతగా ఇంపార్టెంట్ లేకపోవడంతో ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్టు సమాచారం. దీంతో చిత్ర బృందం మరో కథానాయికను వెతికే పనిలో పడ్డారు. గతంలో నయనతార ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిరు సరసన నటించిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.