Chiranjeevi- Balakrishna | తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా చిరంజీవి, బాలకృష్ణల ఇమేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరు గత మూడు దశాబ్దాలుగా పైగా ఒకరితో ఒకరు బాక్సాఫీస్ పోటీ పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి .. ఆచార్య’ మూవీతో .. బాలకృష్ణ.. అఖండతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. ఇక ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత నెల రోజులు కూడా గడవక ముందే శాటిలైట్ ఛానెల్స్‌లో (టీవీ)లో వచ్చేస్తున్నాయి. మంచి మరికొన్ని రెండు నెలలకు వచ్చేస్తున్నాయి. పెద్ద సినిమాలు కూడా 100 రోజులు కూడా పూర్తవ్వక ముందే టీవీల్లో ప్రసారమవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన చాలా ఏళ్ల వరకు టీవీల్లో ప్రపారం కాలేదు. రీసెంట్గా నాని నటించిన ‘జెండాపై కపిరాజు’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలు విడుదలైన మూడు నాలుగేళ్ల తర్వాత టీవీల్లో ప్రసారమయ్యాయి.. కానీ బాలకృష్ణ నటించిన ‘పరమవీర చక్ర’, ‘అధినాయకుడు’ సినిమాలు ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారం కాలేదు. ఇంత వరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడుపోలేదు. బాలయ్య పరమవీరచక్ర విషయానికొస్తే..దాసరి నారాయణరావు 150వ సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు టీవీలో ప్రసారం కాలేదు.
అసలు ఈ సినిమా శాటిలైట్ కూడా కాలేదు. మరోవైపు డిజిటల్ హక్కులు కూడా అమ్ముడు పోలేదు. బాలయ్య కెరీర్లో ఇంతకంటే దారుణం మరోకటి లేదని అభిమానులు ఇప్పటికీ ఫీల్ అవుతుంటారు. కానీ హిందీ వెర్షన్లో మాత్రం అదే ‘పరమవీరచక్ర’ పేరుతో డబ్ అయి యూట్యూబ్‌లో రిలీజైంది.
అపుడెపుడో బాలకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమై ఆగిపోయినా.. ‘నర్తనశాల’ సినిమా ఏటీటీలో గతేడాది విజయ దశమి సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించిన 12 నిమిషాల ఫుటేజ్‌కు పాత ‘నర్తనశాల’లో నరవరా కురువరా పాటను కొంత యాడ్ చేసి 17 నిమిషాల ఫుటేజ్‌తో ఈ సినిమాను NBK థియేటర్స్, శ్రేయాస్ ఏటీటీలో విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా బాలయ్య ఎక్కడో మరుగునపడిన ‘నర్తనశాల’ సినిమాను ఇపుడు బయటకు తీసి రిలీజ్ చేయడం మంచి పరిణామనే చెప్పాలి.
ఆ సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ నటించిన మరో మూవీ ‘అధినాయకుడు’ విషయానికొస్తే.. ఈ సినిమాలో బాలయ్య మొదటిసారి త్రిపాత్రాభినయం చేసారు. ఈ చిత్రం శాటిలైట్ హక్కులు కూడా ఇప్పటి వరకు అమ్ముడు పోలేదు. ఉన్నంతలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా డిజిటల్ హక్కులు కొనుక్కొంది. ఇపుడు యూట్యూబ్‌లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కూడా అవుతోంది. మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్ డబ్బింగ్ హక్కులకు మాత్రం మంచి డబ్బులే వచ్చాయి అదొక్కటే ఊరట.
ఇక చిరంజీవి అతిథి పాత్రలో నటించిన కన్నడ చిత్రం ‘సిపాయి’ చిత్రాన్ని తెలుగులో ‘మేజర్’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఈ చిత్రం విడుదలైన విషయం చాలా మందికి తెలియదు. ఈ చిత్రంలో సౌందర్య, రవిచంద్రన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అంతేకాదు కన్నడ హీరో రవిచంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ.. తానే హీరోగా నటించారు.
ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల తర్వాత ఇప్పటి వరకు టీవీల్లో ప్రసారం కాలేదు. కన్నడతో పాటు తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయింది. 1996లో కన్నడలో విడులైన ఈ సినిమా.. 1998లో తెలుగులో ‘మేజర్’ టైటిల్‌తో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఆ తర్వాత చిరంజీవి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ మంజునాథ’ సినిమాను ఒకేసారి తెలుగు, కన్నడలో చిత్రీకరించారు. తమిళంలో మాత్రం డబ్ చేసి రిలీజ్ చేసారు. మొత్తంగా బాలకృష్ణ, చిరంజీవి కెరీర్లో వాళ్లు యాక్ట్ చేసిన ఈ సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాలు శాటిలైట్ కాలేదనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి..
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలలో అమితాబ్ కాకుండా మరో ఇద్దరు స్టార్ హీరోలు..
Mammootty@50 Years: మమ్ముట్టి నట ప్రస్థానానికి 50 యేళ్లు పూర్తి.. సాధించిన అవార్డులు ఇవే..
ఈ ఫోటోలో క్యూట్ కనిపిస్తోన్న ఈ చిన్నది.. ప్రభాస్ సరసన నటించిన క్రేజీ హీరోయిన్..
Kiara Advani : తన సినిమా ప్రమోషన్లో బిజీ బిజీగా రామ్ చరణ్ భామ కియారా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya movie, Akhanda movie, Balakrishna, Chiranjeevi, Telugu Cinema, Tollywood