Chiranjeevi - Nagarjuna: కోలీవుడ్ సూపర్ హిట్ రీమేక్‌లో చిరంజీవి, నాగార్జున.. సీనియర్ హీరోల క్రేజీ మల్టీస్టారర్‌..

చిరంజీవి,నాగార్జున (Twitter/Photo)

Chiranjeevi - Nagarjuna: కోలీవుడ్ సూపర్ హిట్ రీమేక్‌లో చిరంజీవి, నాగార్జున.. సీనియర్ హీరోల క్రేజీ మల్టీస్టారర్‌‌కు ముహూర్తం ఖరారైందా అంటూ ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

  • Share this:
    Chiranjeevi - Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఎవరి శైలిలో వాళ్లు తమదైన సినిమాలతో ప్రేక్షకుల మనసులు దోచారు. వీళ్లలో ఏ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ మూవీలు చేయలేదు. కానీ ఈ నలుగురు హీరోలు.. వెంకటేష్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’ సినిమాలో ఓ పాటలో గెస్ట్‌‌లుగా మెరిసారు. ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో నటించినా.. కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మరోవైపు లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టైల్’ మూవీలో చిరంజీవి, నాగార్జున అతిథి పాత్రల్లో మెరిసిన తెరను మాత్రం పంచుకోలేదు. కానీ ఇపుడు మాత్రం చిరంజీవి, నాగార్జున ఓ కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా కోసం కలిసి పనిచేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే చిరంజీవి పలు వేరే భాషల్లో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్  చేస్తున్నారు. ఇప్పటికే ‘లూసీఫర్’, ‘వేదాలం’తో పాటు ‘ఎన్నై ఎరిందాల్’ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

    తాజాగా కోలీవుడ్‌లో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ సినిమాను తెలుగులో నాగార్జునతో కలిసి రీమేక్ చేయడానికి చిరు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్‌లు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తెలుగులో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌లో చిరంజీవి యాక్ట్ చేస్తున్నారు. మాధవన్ పాత్రలో నాగార్జున చేయబోతున్నట్టు సమాచారం.



    పుష్కర్ గాయత్రి డైెరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్‌‌ను తెలుగు రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.విక్రమార్కుడు, బేతాళుడు కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే చిరు, నాగ్‌లతో కూడిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం.

    balakrishna,Raja sekhar Will Act Together Tamil Super Hit vikram Veda Telugu Remake,ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో  ఉంది. గత  కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. తాజాగా తమిళంలో హిట్టైయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి బాలయ్య, రాజశేఖర్ ఒకే చెప్పారని సమాచారం.Balakrishna,raja sekhar,Balakrishna Raja sekhar,Balakrishna Raja sekhar Multistarer,Balakirshna Raja sekhar Vikram Veda Telugu Remake,balakrishna raja sekhar vikram veda madhavan vijay sethupathi,Telugu cinema,Tamil Cinema,tollywood,Kollywood,బాలకృష్ణ,బాలయ్య,రాజశేఖర్,బాలకృష్ణ రాజశేఖర్,బాలకృష్ణ రాజశేఖర్ విక్రమ్ వేద రీమేక్,బాలకృష్ణ రాజశేఖర్ మల్టీస్టారర్,బాలకృష్ణ రాజశేఖర్ మాధవన్ విజయ్ సేతుపతి విక్రమ్ వేద రీమేక్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్,కోలీవుడ్ న్యూస్,తమిళ్ సినిమా,ఏపీ పాలిటిక్స్,AP Politics,AP Political News
    విక్రమ్ వేదలో మాధవన్, విజయ్ సేతుపతి (File/Photo)


    ముందుగా ఈ రీమేక్‌ను నాగార్జున, వెంకటేష్‌లతో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెంకటేష్, రానాలతో అనుకున్నారు. ఆ తర్వాత రవితేజ, రానాలతో అన్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు బాలకృష్ణ, రాజశేఖర్. ఆ తర్వాత.. పవన్ కళ్యాణ్, రవితేజ పేర్లు కూడా వినబడ్డాయి. ఫైనల్‌గా ఇపుడు చిరంజీవి, నాగార్జునలు ఈ సినిమా రీమేక్‌లో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఓ నాలుగు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు, బంగార్రాజు సినిమాలున్నాయి. మరి చిరంజీవి, నాగార్జునలైనా ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు ఓకే చెబుతారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే బాలీవుడ్‌లో ఈ రీమేక్‌ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: