CHIRANJEEVI MOHAN RAJA WHY MEGASTAR GIVEN LUCIFER REMAKE IN MOHAN RAJA HANDS HERE ARE THE DETAILS TA
Chiranjeevi: ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలను మోహన్ రాజాకు చిరంజీవి అప్పగించడం వెనక పెద్ద రీజనే ఉంది..
మోహన్ రాజా చేతికి లూసీఫర్ రీమేక్ బాధ్యతలు (Twitter/Photo)
MegaStar Chiranjeevim Lucifer Remake Mohan Raja: మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ దర్శకత్వ బాధ్యతల కోసం ఎంతో మంది దర్శకులు పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమా బాధ్యతలను తాజాగా తమిళంలో ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తెలుగువాడైన మోహన్ రాజాకు అప్పగించాడు.
MegaStar Chiranjeevim Lucifer Remake Mohan Raja: మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ దర్శకత్వ బాధ్యతల కోసం ఎంతో మంది దర్శకులు పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమా బాధ్యతలను తాజాగా తమిళంలో ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తెలుగువాడైన మోహన్ రాజాకు అప్పగించాడు. ఈయనను లూసీఫర్ రీమేక్ బాధ్యతలు అప్పగించడానికి పెద్ద రీజనే ఉందట. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు చిరంజీవి మరికొన్ని చిత్రాలకు ఓకే చెప్పాడు. ఈ సినిమాలన్ని రీమేక్ కథలు కావడం విశేషం. ఇప్పటికే అన్ని సినిమాలకు సంబంధించిన కథలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ ఏజ్‌లో కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నాడు.
ముఖ్యంగా చిరు ప్రస్తుతం లూసీఫర్, వేదాళం రీమేక్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో వేదాళం కోసం మెహర్ రమేష్ ఫిక్స్ అయ్యాడు. ఆయన కథను కూడా సిద్ధం చేసాడు. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లు మెహర్ చేసిన మార్పులకు మెగాస్టార్ ఓకే కూడా చేసేసారు. రీసెంట్గా మెహర్ రమేష్ ఈ సినిమా షూటింగ్ చిరంజీవి లేకుండా మొదలు పెట్టాడు.
చిరంజీవి అజిత్ (chiranjeevi ajith)
మెహర్ రమేష్. వేదాళం విషయంలో క్లారిటీగా ఉన్న చిరు.. లూసీఫర్ రీమేక్ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ చిత్ర దర్శకుడి విషయంలో ముందు నుంచి కూడా ఎక్కడో క్లారిటీ మిస్ అవుతూ వస్తుంది. లూసీఫర్ రీమేక్‌కు ముందు సుజీత్‌ను దర్శకుడిగా తీసుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సుజీత్‌ను కాదని వినాయక్‌ను తీసుకున్నాడు చిరంజీవి.
చిరంజీవి వినాయక్ (Chiranjeevi Vinayak Lucifer movie remake)
అటు వినాయక్ చెప్పిన నేరేషన్ కూడా చిరంజీవికి నచ్చలేదట. దీంతో వినాయక్ .. బెల్లంకొండ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఛత్రపతి రీమేక్ బాధ్యతలను టేకప్ చేసాడు. ఆ తర్వాత బాబీ కూడా ఈ కథను తనదైన ట్రీట్మెంట్తో చిరును కలిస్తే.. అతని చెప్పిన స్టైల్ కూడా చిరు సంతృప్తి వ్యక్త పరచలేదట. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ బాధ్యతలను చిరంజీవి.. హరీష్ శంకర్ చేతిలో పెడదామనుకున్నాడు. కానీ హరీష్ శంకర్ తనకున్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా రీమేక్ చేయలేనని చెప్పాడు. తాజాగా ఈ రీమేక్ బాధ్యతలను తమిళంలో వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళుతున్న మోహన్ రాజాకు అప్పగించాడు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
రు లూసీఫర్ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తోన్న మోహన్ రాజా (Twitter/Photo)
ఇక మోహన్ రాజా.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు కూడా. ఈయన తండ్రి ఎడిటర్ మోహన్.. తెలుగులో చిరంజీవితో అప్పట్లో హిట్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఇక మోహన్ రాజా దర్శకుడిగా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఆతర్వాత తన తమ్ముడు జయం రవితో వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తమిళంలో తన తమ్ముడితో తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. అంతేకాదు రీమేక్‌లను హ్యాండిల్ చేయడంలో మంచి పట్టు సాధించాడు మోహన్ రాజా. అందుకే చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలను మోహన్ రాజా చేతిలో పెట్టాడు. ఈయన నేరేట్ చేసిన ట్రీట్మెంట్కు చిరంజీవి కూడా ఫిదా అయ్యాడు. మరి ‘లూసీఫర్’ రీమేక్‌తో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ రాజా..చిరంజీవికి మంచి సక్సెస్ అందిస్తాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.