Chiranjeevi - Mohan Raja : లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ మోహన్ రాజా.. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవీ.. ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. అందులో ఒక పాటను చిరంజీవి, రామ్ చరణ్ లపై పిక్చరైజ్ చేయనున్నారు. మరో పాటను రామ్ చరణ్, పూజా హెగ్డేలపై చిత్రీకరించనున్నారు. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ఎపుడో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (శుక్ర వారం) ప్రారంభమైంది.
ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించనున్నారు. అదే రోజు ‘ఆచార్య’ సినిమా విడుదల తేదిని కూడా అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
⚡️#Chiru153Begins⚡️
— Konidela Pro Company (@KonidelaPro) August 13, 2021
Lights? Camera ? Action ?
Our next with the One and only #MegaStar @KChiruTweets, #Chiru153 shoot begins today.
Directed by @Jayam_MohanRaja. @alwaysramcharan #RBChoudary @ProducerNVP@KonidelaPro @MegaaSuperGood1 @MusicThaman #NiravShah @sureshsrajan pic.twitter.com/5OuiKfy7dL
ఈ రీమేక్ చిత్రానికి మ్యూజిక్ థమన్ పనిచేస్తున్నారు. హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. విద్యా బాలన్ తెలుగులో ఇప్పటికే బాలయ్య హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే. మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీ నుంచి అదిరిపోయిన క్రేజీ అప్డేట్..
Hrithik Roshan - Deepika: హృతిక్ రోషన్, దీపికా పదుకొణేల ‘ఫైటర్’ మూవీ విడుదల తేది ఖరారు..
HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..
Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, God Father Movie, Lucifer, Mohan Raja