Chiranjeevi - Mohan Raja : ఈ ఆదివారం (ఆగష్టు 22)న మెగాస్టార్ 66వ యేట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవీ.. ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. అందులో ఒక పాటను చిరంజీవి, రామ్ చరణ్ లపై పిక్చరైజ్ చేయనున్నారు. మరో పాటను రామ్ చరణ్, పూజా హెగ్డేలపై చిత్రీకరించనున్నారు. ఈ సినిమా విడుదల తేదిని చిరు బర్త్ డే సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆగష్టు 13న ఈ సినిమా షూటింగ్ అఫీషియల్‌గా మొదలైంది. లైట్స్, కెమెరా, యాక్షన్ అంటూ చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ స్టార్ట్ చేసారు డైరెక్టర్ మోహన్ రాజా..
ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆదివారం చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ అఫీషియల్‌గా ప్రకటించారు. హాలీవుడ్‌లో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో వచ్చిన సినిమా ఎంతో సంచలనం కలిగించింది. ఆ సినిమా స్పూర్తితో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇపుడు చిరు కూడా అదే ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. ఇపుడు చిరంజీవి హీరోగా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో వస్తోన్న రెండో సినిమా.
Presenting the Supreme Reveal of Megastar @KChiruTweets in a never seen before avatar as #GodFather?@jayam_mohanraja @AlwaysRamCharan #RBChoudary @ProducerNVP @KonidelaPro @SuperGoodFilms_ @MusicThaman @sureshsrajan#Chiru153 #HBDMegaStarChiranjeevi pic.twitter.com/e9BYCwQz7b
— Konidela Pro Company (@KonidelaPro) August 21, 2021
ఈ రీమేక్ చిత్రానికి మ్యూజిక్ థమన్ పనిచేస్తున్నారు. హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ లేదా నయనతార మెగాస్టార్ కి సిస్టర్‌గా నటించబోతుందని తెలుస్తోంది.
దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం.మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన అప్‌డేట్ చూసి మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి, బాబీ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. మెగా బర్త్ డే ట్రీట్ మాములుగా లేదుగా..
Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..
Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..
HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, God Father Movie, Lucifer, Tollywood