CHIRANJEEVI MOHAN RAJA GOD FATHER UPDATE MALAYALAM STAR BIJU MENON TO PLAY KEY ROLE SR
Chiranjeevi | God Father : చిరంజీవి గాడ్ ఫాదర్లో మలయాళీ నటుడు కీలకపాత్ర..
చిరంజీవి (File/Photo)
Chiranjeevi | God Father : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నాడట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. దీనిపై కూడా అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది. విద్యా బాలన్ తెలుగులో ఇప్పటికే బాలయ్య హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన సంగతి తెలిసిందే.
మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పైగా హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేశారట. సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇటీవల హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మరో సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. ఆచార్య ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.