Chiranjeevi - Mohan Babu: చిరంజీవి పై మోహన్ బాబు గుస్సా.. మా ఎలక్షన్స్ నేపథ్యంలో రాజుకున్న నిప్పు..

మోహన్ బాబు, చిరంజీవి (Mohan Babu Chiranjeevi)

Chiranjeevi - Mohan Babu: ’మా’ ఎలక్షన్స్ నేపథ్యంలో మరోసారి చిరంజీవి, మోహన్ బాబు మధ్య దూరం పెరిగిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

 • Share this:
  Chiranjeevi - Mohan Babu: ’మా’ ఎలక్షన్స్ నేపథ్యంలో మరోసారి చిరంజీవి, మోహన్ బాబు మధ్య దూరం పెరిగిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవిది టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ అనే చెప్పాలి. ఎపుడు కలిసినట్టే ఉంటారు. ఇంతలోనే ఎవరివారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది వీరి వ్యవహారం. అసలు కడుపులు కత్తుల పెట్టుకొని పైకి పొత్తు ఉన్నట్టు ఉంటుంది చూసే వాళ్లకు వీరి వ్యవహారం. తాజాగా మా ఎలక్షన్స్ నేపథ్యంలో మరోసారి చిరంజీవి పై మోహన్ బాబు తన అసహనం వ్యక్తం చేస్తున్నారు.మా అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఇండస్ట్రీలో 24 గంటలుగా చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ ఈ సారి అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు.

  చిరంజీవి, మోహన్ బాబు వీళ్లిద్దరు ఎన్నోసినిమాల్లో కలిసి నటించారు. కొన్ని సినిమాల్లో వీళ్లిద్దరు హీరోలుగా నటిస్తే.. మరికొన్ని సినిమాల్లో చిరు హీరోగా నటిస్తే.. మోహన్ బాబు విలన్‌గా యాక్ట్ చేసారు. ఇక మోహన్ బాబు, చిరంజీవి కూడా హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్‌గా నటించారు. ఇక చిరంజీవి మాత్రం అగ్ర హీరోగా తెలుగులో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  ఇక మోహన్ బాబు మాత్రం కాస్తా లేటుగా మళ్లీ హీరోగా బ్రెేక్ లభించింది. హీరోగా మోహన్ బాబు నటించిన చాలా చిత్రాలను ఆయనే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మోహన్ బాబు పూర్తి స్థాయి హీరోగా మారిన తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించలేదు. వీళ్లిద్దరు మొదటి సారి ‘శ్రీరామబంటు’ సినిమాలో కలిసి నటించారు. చివరగా ‘కొదమ సింహం’లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

  Love Story Pre Release Event : నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదిరిన చిరు, సాయి పల్లవిల డాన్స్ మూమెంట్స్..

  తాజాగా ‘మా’ ఎలక్షన్ నేపథ్యంలో మరోసారి వీళ్లిద్దరి మధ్య విభేదాలు మళ్లీ పొడసూపాయి. మా అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్‌కు ఆయనకు మెగాస్టార్ చిరంజీవి అండదండలు కూడా ఉన్నాయని నాగబాబు మాటలతోనే అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో మంచు విష్ణు కూడా అధ్యక్ష బరిలోనే ఉన్నారు.  దాంతో అసలు కథ మొదలైంది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అంటే ఒకప్పుడు జెంటిట్మన్‌ అసోసియేషన్‌ అనేవాళ్లు.

  Mohan Babu: నట ప్రపూర్ణ మోహన్‌బాబును కలెక్షన్ కింగ్ చేసింది ఎవరో తెలుసా..


  అంటే అంతా కలిసికట్టుగా ఉండి ఒకర్ని అధ్యక్షుడిగా ఎన్నకునేవాళ్లు. లేదంటే పెద్దలు చెప్పిన వాళ్లకే ఓటేసేవాళ్లు. కానీ మూడు నాలుగేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా గత రెండు పర్యాయాలుగా చూస్తే ఆ సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఇవి కూడా మెయిన్ ఎలక్షన్స్ అయిపోయాయి. అందులోనూ ఒకరినొకరు తిట్టుకోవడాలు.. అరుచుకోవడాలు చేస్తున్నారు. కుదిర్తే కొట్టేలా కూడా కనిపిస్తున్నారు. అంతగా రచ్చ జరుగుతుంది.

  chiranjeevi vs mohan babu,chiranjeevi vs mohan babu maa elections,chiranjeevi vs mohan babu maa association,chiranjeevi vs mohan babu manchu vishnu prakash raj,manchu vishnu vs prakash raj,telugu cinema,మా అసోసియేషన్ ఎన్నికలు 2021,మా ఎన్నికలు చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు
  చిరంజీవి, మంచు విష్ణు (Chiranjeevi Manchu Vishnu)


  ఈ సారి ఏకంగా చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు జరిగేలా కనిపిస్తుంది. ఇండస్ట్రీకి పెద్దగా దాస‌రి నారాయణరావు ఉన్న‌ప్పుడు ఆయ‌న మాట చెల్లుబాటు అయింది. అప్పుడు ‘మా’లో లుకలుకలు లేకుండా ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగానే సాగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. అయితే ఈ మధ్యే చిరంజీవి, మోహన్‌ బాబు, కృష్ణంరాజు లాంటి వాళ్లంతా కలిసి తామంతా ఒక్కటే అని చెప్పుకున్నారు. ఇప్పటికైనా సమస్య అయిపోతుందేమో అనుకున్నారంతా.

  prakash raj,prakash raj twitter,prakash raj instagram,prakash raj movies,prakash raj MAA elections 2021,prakash raj MAA contest chiranjeevi support,prakash raj chiranjeevi support,ప్రకాశ్ రాజ్,ప్రకాశ్ రాజ్ మా అసోసియేషన్ ఎన్నికలు,చిరంజీవి మా అసోసియేషన్ చిరంజీవి మద్దతు
  చిరంజీవి ప్రకాశ్ రాజ్ (Chiranjeevi Prakash Raj)


  రాబోయే మా అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవం ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్లీ మొదటికొచ్చింది. ప్రకాశ్ రాజ్‌కు వ్యతిరేకంగా మంచు విష్ణు నిలబడ్డాడు. వచ్చే నెల 10న మా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.  అయితే పోటీ మాత్రం ప్రకాష్ రాజ్‌, మంచు విష్ణుల మధ్య ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: