హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - Samantha: సమంత చిలిపి ప్రశ్నకు అదిరిపోయిన చిరంజీవి కొంటె సమాధానం.. సోషల్ మీడియాలో వైరల్..

Chiranjeevi - Samantha: సమంత చిలిపి ప్రశ్నకు అదిరిపోయిన చిరంజీవి కొంటె సమాధానం.. సోషల్ మీడియాలో వైరల్..

సమంత, చిరంజీవి (Twitter/Photo)

సమంత, చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi-Samantha: సమంత చిలిపి ప్రశ్నకు అదిరిపోయిన చిరంజీవి కొంటె ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  Chiranjeevi-Samantha: సమంత చిలిపి ప్రశ్నకు అదిరిపోయిన చిరంజీవి కొంటె ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ఈ మధ్య కాలంలో ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం సమంత యాంకర్ అవతారం ఎత్తింది. మాములు ఇంటర్వ్యూలో తరహాలో కాకుండా కాస్త వెరైటీగా ఈ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసినట్టు కనపడుతోంది.  బాలీవుడ్‌లో కాఫీ విత్ కరణ్ తరహాలో ఉంది. కానీ సామ్ జామ్‌లో సెలబ్రిటీల ఇంటర్వ్యూలో పాల్గొనే ప్రేక్షకులతో ఆటా పాటా ఆడించి వారికి గిప్ట్‌లు కూడా ఇస్తున్నారు. ఇది మాత్రం కాస్త వెరైటీగా ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ,  రానా, తమన్నా, రకుల్, క్రిష్ తదితరులు సందడి చేసారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి ఈ షోలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ పూర్తైయింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయనున్నట్టు ఓ వీడియోను పంచుకున్నారు.

  ఇందులో భాగంగా సమంత ..చిరంజీవిని ఓ చిలిపి ప్రశ్న వేసింది. అదేమిటంటే మీ ఫ్రిజ్‌లో ఎపుడు ఉండే ఓ ఐటెమ్ ఏమిటి ? అని చిరంజీవి ప్రశ్నించింది. దానికి మెగాస్టార్ అంతే స్పాంటేనియస్‌గా కొంటే సమాధామిచ్చారు.

  మీరనుకునేది కాదు అంటూ సరదాగా ఆటపట్టించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది. ఈ మెగా ఎపిసోడ్ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోలో చిరంజీవి తన పర్సనల్ లైఫ్‌‌కు సంబంధించిన విషయాలను పంచుకోనున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత వేదాలం, ‘లూసీఫర్’ రీమేక్ సినిమాలకు ఓకే చెప్పాడు. ఇప్పటికే వేదాళం సినిమాను మొదలవగా.. లూసీఫర్ రీమేక్ వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aha OTT Platform, Chiranjeevi, Samantha, Tollywood

  ఉత్తమ కథలు