Chiranjeevi - Sukumar : సుకుమార్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ’పుష్ప’ మూవీతో ఇరగదీసావు అంటూ మెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక మందన్న యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి వసూళ్లే దక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు వర్షం కురిపించారు. అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ పై ప్రశంసలు కురిపించారు.
అంతేకాదు ‘పుష్ప’ మూవీ చూసి డైరెక్టర్ సుకుమార్‌ను కలిసి చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి నాలుగు రోజుల వరకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత అల్లు అర్జున్ సినిమాకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప సేఫ్ అవ్వడం ఈజీ కాదు.
Megastar @KChiruTweets garu watched & loved every bit of #PushpaTheRise ?? Met @aryasukku garu & congratulated for the Blockbuster Success ?#PushpaBoxOfficeSensation @alluarjun @iamRashmika @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial pic.twitter.com/F5mS8SaWl2
— Pushpa (@PushpaMovie) December 27, 2021
నైజాంలో మాత్రం ఈ సినిమా సేఫ్ అయింది. అలాగే హిందీ, తమిళ, మలయాళంలో కూడా అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప. వీక్ డేస్‌లో పుష్ప చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగులో బాగా పడిపోయాయి కలెక్షన్స్. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో రూ. 76.46 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి 10 రోజుల్లో ఈ సినిమాకు
10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 130.94 కోట్లు (229 కోట్లు గ్రాస్) / 144.90 కోట్లు రాబట్టాలి.
పుష్ప సినిమాకు అన్ని భాషల్లో కలిపి రూ. 145 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ సినిమాకు 131 కోట్ల షేర్ వచ్చింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత సినిమా చాలా చోట్ల స్లో అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్పకు కోరుకున్న వసూళ్లు రావడం లేదు. ఇక్కడింకా సేఫ్ అవ్వాలంటే కనీసం రూ. 26 కోట్లు రావాల్సిందే. ప్రస్తుతానికి సెకండ్ వీకెండ్ ఎలా చేస్తుందనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.