
చిరంజీవి, మెహర్ రమేష్ (File/Photo)
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. తాజాగా మెహర్ రమేష్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడింది.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన షెడ్యూల్ కంప్లీట్ చేసి వచ్చే యేడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు చిరంజీవి.. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ముందుగా సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నా.. ఫైనల్‌గా ఈ రీమేక్ బాధ్యతలను వినాయక్ చేతిలో పెట్టారు చిరంజీవి. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెహర్ రమేష్ తనకు బర్త్ డే విషెస్ తెలియజేసినందకు ధన్యవాదాలు తెలుపుతూ.. చిరంజీవితో నీ ఫోర్త్ కమింగ్ సినిమా సక్సెస్ కావాలని ట్వీట్ చేసాడు. ఇక మెహర్ రమేష్.. చిరంజీవికి కజిన్ వరుస అవుతాడు. ఇక చిరంజీవిని స్టోరీతో మెప్పించడం అంతా ఈజీ కాదు. మరి మెహర్ రమేష్ ఏం చెప్పి.. చిరంజీవిని ఓకే అనిపించాడా అనేది ఇప్పటికీ సస్పెన్సే.
దీంతో చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు పటా పంచలయ్యా యి. ఈ చిత్రాన్ని కూడా చిరంజీవి, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో చేయనున్నట్టు సమాచారం. ఒక మెహర్ రమేష్.. ఏడేళ్ల క్రితం వెంకటేష్‌తో షాడో సినిమా చేసాడు. ఆ తర్వాత మహేష్ బాబుకు సంబంధించిన యాడ్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:September 03, 2020, 15:04 IST