Chiranjeevi Mega Family: తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మరో కథానాయకుడు పరిచయం కాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి నట వారసుడిగా ముందుగా నాగబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. కానీ చిరు చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలు సత్తా చాటారు. ఇక చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా బుడి బుడి అడుగులు వేస్తున్నాడు. పెద్దల్లుడు విష్ణు ప్రసాద్.. వెబ్ సిరీస్లు నిర్మిస్తూ నిర్మాతగా రాణిస్తున్నాడు. నిహారిక కూడా కథానాయికగా ఎంట్రీ ఇచ్చి పెళ్లి చేసుకొని సెటిలైంది. రీసెంట్గా చిరంజీవి చిన్న మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్..’ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమై తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి ఔరా అనిపించాడు. తాజాగా మెగా ఫ్యామిలీ నుండి.. మరో హీరో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.
నిర్మాత అల్లు అరవింద్ బావమరిది కొడుకు విరాన్ ముత్తంశెట్టి..హీరోగా పరిచయం కాబోతున్నాడు.ఈ సినిమాకు బతుకు బస్టాండ్ అనే టైటిల్ ఖరారు చేసారు. జూన్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా కంటే ముందు మరో సినిమా కూడా చేస్తున్నాడు.
View this post on Instagram
మరోవైపు నాగబాబు అల్లుడు నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే నటనలతో డాన్సులో శిక్షణ తీసుకోబోతున్నట్టు సమాచారం. మొత్తంగా మెగా ఫ్యామిలీ నుంచి ఈ హీరోల జాతర ఇప్పట్లో ఆగేలా కనబడటం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Pawan kalyan, Tollywood, Vaishnav tej