Home /News /movies /

CHIRANJEEVI MEGA 154 SURPRISE RAVI TEJA GRAND ENTRY VIDEO VIRAL SLB

Mega 154 బిగ్ సర్‌ప్రైజ్.. రవితేజ గ్రాండ్ ఎంట్రీ వీడియో వైరల్

Photo Twitter

Photo Twitter

Mega 154 కోసం చిరంజీవితో కలిసి మాస్ మహారాజ్ రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోనుండటం తెలుగు ప్రేక్షకుల్లో ఆతృతను రెట్టింపు చేసింది. ఈ క్రమంలోనే బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. Mega 154 పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మెగా మాస్ కాంబో సెట్ చేశారు డైరెక్టర్ బాబీ. చిరంజీవితో కలిసి మాస్ మహారాజ్ రవితేజ (Ravi teja) స్క్రీన్ షేర్ చేసుకోనుండటం తెలుగు ప్రేక్షకుల్లో ఆతృతను రెట్టింపు చేసింది. గత రెండుమూడు రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా స్ట్రోమ్ అంటూ మాస్ మహారాజ్ ఎంట్రీ తాలూకు వీడియో వదులుతూ ఇరువురి అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

రవితేజకు వెల్ కమ్ చెబుతూ డైరెక్టర్ బాబీ షేక్ హ్యాండ్ ఇవ్వడం ఈ వీడియోలో చూపించారు. రవితేజ ఎంట్రీ ఇస్తుండగా బ్యాక్ గ్రౌండ్‌లో మాతో పెట్టుకుంటే మడతదిపోద్ది అంటూ ఆయన మాస్ సాంగ్ ప్లే చేసి మరింత అట్రాక్ట్ చేశారు. దీంతో విడుదల చేసిన క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. రవితేజ స్వాగతం అంటూ మెగాస్టార్ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. గతంలో అన్నయ్య సినిమాలో చిరు తమ్ముడిగా అలరించిన రవితేజ.. తాజాగా మరోసారి మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ఆసక్తికరంగా మారింది.

వాల్తేరు వీరయ్య అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ చిరుకి తమ్ముడిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో గురువారం రవితేజ జాయిన్ అయ్యారు. ఇంతలోనే రవితేజ ఎంట్రీ వీడియో వదిలి సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్.

అన్నయ్య సినిమా తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఓ పాటలో కూడా మెరిశాడు రవితేజ. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ మెగా మాస్ కాంబో అలరించనుండటం విశేషం. మూవీ కోసం రవితేజ దాదాపు రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రవితేజ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా ఆయన పాత్ర డిజైన్ చేశారని, ఈ రోల్ సినిమాలో ఎంతో కీలకం కానుందని తెలుస్తోంది. సో.. చూడాలి మరి రవితేజ, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందనేది!.Tolly
Published by:Sunil Boddula
First published:

Tags: Chiranjeevi, Ravi Teja, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు