Chiranjeevi - Manoj : సైదాబాద్ కీచకుడి ఆత్మహత్యపై చిరంజీవి, మంచు మనోజ్ సహా సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరు సంవత్సరాల చిన్నారిపై దారుణ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్నారిపై జరిగిన ఆ ఘటన ఎందరినో కలిచివేసింది. ఘటనకు కారకుడైన నీచుడుని పట్టుకొని శిక్షించాలని కోరుకుంటున్నారు. అంతేకాదు ఆ చిన్నారికి, ఆ కుటుంబానికి మద్దతుగా పలు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు మంచు మనోజ్, మహేష్ బాబు,నాని సహా పలువురు ప్రముఖులు అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే కదా.
ఈ సంఘటనపై నాని స్పందిస్తూ.. తెలంగాణ పోలీసు పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ.. వాడు బయటెక్కడో ఉన్నాడు వాడు ఉండకూడదు చంపెయ్యల్సిందే అన్నట్టుగా స్పందించారు నాని. నిందితుడిని పట్టుకుంటే హైదరాబాద్ పోలీస్ భారీ నజరానా కూడా ప్రకటించారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీ (Singareni Colony Girl Incident )లో అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ ముప్పై ఏళ్ల కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత ఆ చిన్నారిని హత్య చేసి చంపేశాడు. వినాయక చవితి నాడు జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ ఘటనకు బాధ్యుడైన రాజు అనే వ్యక్తి వరంగల్ జిల్లా ఘన్పూర్ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నారు. అతని శరీరంపై టాటూల ఆధారంగా అతడు అత్యాచార నిందితుడు రాజు అని గుర్తించారు. దీనిపై ప్రముఖ నటుడు చిరంజీవి ట్వీట్ చేసారు.
అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే కిరాతకుడు తనకు తాను శిక్ష విధించుకోవడంతో బాధితుల కుటుంబంతో పాటు మిగతా వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ ట్వీట్ చేసారు.
— Women Safety Wing Telangana State Police (@ts_womensafety) September 16, 2021
దానికి మంచు మనోజ్.. మంచి వార్త చెప్పారు థాంక్యూ సర్. నిజంగా దేవుడున్నాడు అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. రీసెంట్గా మంచు మనోజ్ స్వయంగా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే కదా.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.