అవును.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌నే చిరంజీవి ఏడిపించాడు.. అది కూడా మామూలుగా కాదు.. వెక్కి వెక్కి ఏడ్చేలా చేసాడు మెగాస్టార్. సుధీర్‌తో పాటు ఆయన తమ్ముడు కూడా ఏడ్చేసాడు. అసలు అంత సందర్భం ఎందుకొచ్చింది..? ఎందుకు అంతగా సుధీర్‌తో పాటు ఆయన తమ్ముడు కూడా ఏడ్చాడు.. పైగా చిరంజీవి ఎందుకు ఏడిపించాడు అనుకుంటున్నారా..? దీని వెనక చిన్న కథ ఉంది. ఓ సారి తన తమ్ముడితో పాటు చిరంజీవి ఇంటికి వెళ్లాడు సుడిగాలి సుధీర్. అప్పటికే ఈ కమెడియన్ గురించి చిరంజీవికి తెలుసు. ఆ పరిచయంతోనే మెగాస్టార్ ఇంటికి వెళ్లాడు.
తన తమ్ముడు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లిన సుధీర్‌కు అక్కడ చిరంజీవిని.. ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసిన తర్వాత షాక్ అయిపోయాడు. సుధీర్‌ను చూసిన వెంటనే చిరంజీవి స్వయంగా వచ్చి కౌగిలించుకుని.. బాగున్నావా అని అడగడం.. ఆప్యాయంగా మాట్లాడటంతో తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పాడు సుధీర్. చిన్నప్పటి నుంచి తాము కలలు కన్న స్టార్.. ఒక్కసారైనా చూస్తే చాలు అనుకున్న స్టార్ కాస్తా తనను కౌగిలించుకోవడం అనేది చిన్న విషయం కాదని.. ఆ క్షణం తన జీవితానికి అది చాలనిపించిందని చెప్పాడు ఈ కమెడియన్.
చాలాసేపు తమతో మాట్లాడిన చిరంజీవి.. మాటల్లో ఉండగానే తమ వాళ్లకు ఎవరికో ఫోన్ చేసి బహుమతి కూడా తెప్పించాడని గుర్తు చేసుకున్నాడు. తన అమ్మానాన్నలకు బట్టలు పెట్టిన చిరంజీవి.. తనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాడు. ఒక్కసారి ఆ గిఫ్ట్ తీసుకుని బయటికి వచ్చిన తర్వాత ఒకటే ఏడుపు వచ్చిందని చెప్పాడు సుధీర్. పైగా తనతో పాటు తమ్ముడు కూడా ఏడుస్తూనే ఉన్నాడని.. అదే సంగతి తమ తల్లిదండ్రులకు కూడా చెప్పి ఏడ్చేసామని చెప్పాడు సుడిగాలి సుధీర్.
గతంలో కూడా సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో చిరంజీవి సెట్‌కు వచ్చాడని.. అక్కడ నాగబాబు తమను పరిచయం చేయబోతుంటే నాకెందుకు తెలియదు.. సుడిగాలి సుధీర్ కదా అంటూ తన పేరు చెప్పాడని తెలిపాడు. అప్పుడు చిరంజీవి గారికి నేను తెలుసా అంటూ ఆశ్చర్యపోయానని చెప్పాడు ఈయన. మొత్తానికి సుధీర్‌ను అయితే చిరంజీవి వెక్కివెక్కి ఏడ్చేలా చేసాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood