ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మహేష్ బాబు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా వార్తులు వినిపిస్తున్నాయి. ఐతే.. మహేష్ బాబు.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో చిరంజీవి సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తాడా అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మహేష్ బాబు గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చిరంజీవి గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫంక్షన్ వేదికగా చిరంజీవి, మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమాలో ఒక ముఖ్యపాత్ర ఉందట. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్‌ను అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యేంత వరకు ఏ సినిమాలో యాక్ట్ చేయోద్దని రామ్ చరణ్‌కు కండి షన్స్ పెట్టాడట. ముందుగా ఆర్ఆర్ఆర్ ఈ సినిమాను ఈ యేడాది జూలై 31న విడుదల చేద్దానకున్నారు. ఆ తర్వాత దసరాకు చిరంజీవి, కొరటాల శివను షెడ్యూల్ చేసారు. కానీ తీరా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే కదా. అందుకే రామ్ చరణ్.. తన తండ్రి చిరంజీవి నటించే సినిమాలో యాక్ట్ చేయడం లేదు.

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విజయశాంతి చిరంజీవిలతో మహేష్ బాబు (Twitter/Photo)
ఇపుడు అదే క్యారెక్టర్ కోసం దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబును సంప్రదించాడట. అంతేకాదు ఈ సినిమాలో ఆయన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను వివరించినట్టు సమాచారం. మరోవైపు చిరంజీవి కూడా మహేష్ బాబుకు పర్సనల్‌గా ఫోన్ చేసి ఈ సినిమా విషయమై అడిగినట్టు సమాచారం. దీంతో మహేష్ బాబు.. తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని గెస్ట్ పాత్రను చిరు సినిమాలో చేయాలనే నిర్ణయానికొచ్చినట్టు చెబుతున్నారు. ఇక మహేష్ బాబు కూడా గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అను నేను’ అనే బ్లాక్ బస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే కదా. మరోవైపు చిరంజీవితో ఏర్పడిన సాన్నిహిత్యంతో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు కేవలం 15 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్టు సమాచారం. చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు విద్యార్ధి నాయకుడిగా పవర్ఫుల్ పాత్ర చేయబోతున్నట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి చిరంజీవి, మహేష్ బాబు మల్టీస్టారర్ పై క్లారిటీ రావాలంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 26, 2020, 13:11 IST