చిరంజీవి సినిమాకి డైరెక్టర్ మార్పు.. లైన్లోకి వచ్చిన సీనియర్ డైరెక్టర్..

Chiranjeevi : ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్యలో నటిస్తున్న చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని సాహో లాంటీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 28, 2020, 6:58 AM IST
చిరంజీవి సినిమాకి డైరెక్టర్ మార్పు.. లైన్లోకి వచ్చిన సీనియర్ డైరెక్టర్..
చిరంజీవి (Chiranjeevi/Twitter)
  • Share this:
Chiranjeevi : ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్యలో నటిస్తున్న చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని సాహో లాంటీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చేయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న'లూసిఫర్' తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించబోతున్నాడు. అయితే ఈ రీమేక్ కి సుజీత్ దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను చిరంజీవి యువ దర్శకుడు సుజిత్‌కు అప్పజెప్పినట్లు.. అంతేకాదు సుజీత్ తెలుగు నేటివిటికి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు కూడా  చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుజీత్ చేసిన మార్పులు, ఆయన చేసిన చేర్పులు చిరంజీవికి నచ్చలేదట. సుజీత్ రాసిన స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందని చిరు ఈ క్రేజీ ప్రాజెక్టును అనుభవం ఉన్న డైరెక్టర్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగా ఈ సినిమాను వినాయక్‌తో చేయాలనీ నిర్ణయానికి వచ్చాడట. వినాయక్, చిరంజీవి కాంబినేషన్‌లో గతంలో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్టైనా సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 'లూసిఫర్' రీమేక్ కి దర్శకత్వం వహించే అవకాశం వినాయక్ కి ఇవ్వాలని భావిస్తున్నారట చిరంజీవి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేదు. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఖుష్బూను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Chiranjeevi new look, Chiranjeevi acharya update, ashmika mandanna to romance with Ram charan, chiranjeevi film update, ఆచార్య న్యూస్, చిరంజీవి, రామ్ చరణ్, రష్మిక మందన,
న్యూలుక్‌లో చిరంజీవి Photo : Instagram


ఇక ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య మంచి అంచనాలతో వస్తోంది. దాదాపు 60 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తోంది. మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈయనకు జోడిగా మొదట రష్మిక మందన అన్నారు. తాజాగా జాన్వీ కపూర్ అంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి నిర్మిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
Published by: Suresh Rachamalla
First published: July 28, 2020, 6:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading