news18-telugu
Updated: November 26, 2020, 2:36 PM IST
చిరంజీవి Photo : Twitter
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఆచార్య' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా కరోనా వైరస్ కారణంగా ఆచార్య షూటింగ్ కొన్ని నెలలు ఆగిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం కొంత తగ్గిడంతో ఇటీవలే మరో షెడ్యూల్ మొదలైంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారని సమాచారం. అంతేకాదు దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండే ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. ఆచార్యలో ముందునుండి త్రిషను అనుకుంటే ఆమె ఏవో కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కాజల్‌ను తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక అది అలా ఉంటే ఆచార్య షూటింగ్లో ఉండగానే చిరంజీవి మరో సినిమాకు ఓకే చెప్పారు. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో క్రితం ఏడాది వచ్చిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే ఆసక్తి మెగా అభిమానుల్లో మొదలైంది.

కీర్తి సురేష్ Photo : Twitter
అయితే ఈ రీమేక్ కి సుజీత్ దర్శకత్వం వహిస్తాడని.. అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సుజీత్ తెలుగు నేటివిటికి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు కూడా చేసాడని.. అయితే సుజీత్ చేసిన మార్పులు, ఆయన చేసిన చేర్పులు చిరంజీవికి నచ్చలేదని.. అంతేకాదు సుజీత్ రాసిన స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందని చిరు ఈ క్రేజీ ప్రాజెక్టును అనుభవం ఉన్న డైరెక్టర్ వినాయక్‌తో చేయాలనీ నిర్ణయానికి వచ్చాడని వార్తలు రాగా.. తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను మరోదర్శకుడు మోహన్ రాజాకు అప్పగించినట్లు తెలుస్తోంది. మోహన్ రాజా గతంలో చాలా రీమేక్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తెలుగులో హనుమాన్ జంక్షన్‌ను డైరెక్ట్ చేసింది ఇతడే. ఆ తర్వాత తమిళ్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అంతేందుకు రామ్ చరణ్ ధృవ ఒరిజనల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసింది మోహన్ రాజానే. ఇక అది అలా ఉంచుతే ఈ సినిమా గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చిరంజీవి హీరోయిన్ లేదని తెలుస్తోంది. సినిమా అంటే హీరో, హీరోయిన్ పక్కా. అదో లెక్కగా నడుస్తోంది. కానీ కథను బట్టి ఈ లెక్కల్ని మార్చొచ్చు. కథ అడిగినప్పుడు హీరో లేకుండా లేదా హీరోయిన్ లేకుండా సినిమాలు చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా చిరంజీవి కూడా హీరోయిన్ లేకుండా సినిమా చేయబోతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ లో కూడా నటించనున్నారు. అజిత్ హీరోగా 2015లో వచ్చిన వేదాళం మూవీ తమిళ్లో భారీ విజయాన్ని నమోదుచేసుకుంది. ఆ సినిమాలో అజిత్ రోల్ అక్కడి ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. దీంతో ఆ పాత్రకు తనకు సూటవుతుందని భావించిన మెగాస్టార్ ఈ మూవీ రీమేక్ లో నటించనున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతోన్న డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వ్యవహరిస్తాడని టాక్. ఇక ఇదే సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించనుందట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
Published by:
Suresh Rachamalla
First published:
November 26, 2020, 2:35 PM IST