• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • CHIRANJEEVI LUCIFER REMAKE UPDATE NAYANTHARA WILL BE SEEN IN A KEY ROLE HERE ARE THE DETAILS SR

Chiranjeevi : చిరంజీవికి చెల్లెలుగా లేడీ సూపర్ స్టార్.. కానీ ఒక కండీషన్..

చిరంజీవి Photo : Twitter

Chiranjeevi : లూపిఫర్ తెలుగు రీమేక్‌లో చిరంజీవికి చెల్లెలుగా లేడీ సూపర్ స్టార్ నటించనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించడానికి ఆమె ఓ కండీషన్..‌ పెట్టిందట.

  • Share this:
    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. 'ఆచార్య' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే ఆయన ఓ మలయాళీ చిత్రం తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఏడాది క్రితం వచ్చిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. ఇక తెలుగులో ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాపై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నయనతార నటించనుందని తెలుస్తోంది. అదీ కూడా చిరంజీవి చెల్లెలు పాత్రలో అని వినికిడి. నయనతార గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. ఆమె ఓ సూపర్ స్టార్.. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్.. మరి ఆమె చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించనుందని తెలుస్తోంది.

    మలయాళంలో మంజూ వారియర్ చేసిన పాత్రలో నయన్ కనిపించనుందట. అయితే ఈ సినిమాలో ఆమె నటించడానికి ఒప్పుకున్నా ఒక కండీషన్ పెట్టిందట. తన సీన్స్ మొత్తం ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలనీ షరతు పెట్టిందట. దీనికి చిత్ర దర్శక నిర్మాతలు కూడా సరే అన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. అయితే ఇదే పాత్రలో హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించనుందని ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని, చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పాత్ర పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో నయనతార నటించనుందని తాజా సమాచారం. నయనతార ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తేతో పాటు నెట్రికన్, కవాతులు రెండు కాదల్ అనే మూడు సినిమాల్లో నటిస్తోంది. నయనతార తెలుగులో చివరిసారిగా చిరంజీవి సైరాలో కనిపించింది.

    ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆ పాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘రారాజు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా విషయానికి వస్తే.. తమిళంలో “జయం” వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు. తెలుగులో హనుమాన్ జంక్షన్‌ను డైరెక్ట్ చేసింది ఇతనే. ఆ తర్వాత తమిళ్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేందుకు రామ్ చరణ్ ధృవ ఒరిజనల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసింది మోహన్ రాజానే.



    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ లో కూడా నటించనున్నారు. అజిత్ హీరోగా 2015లో వచ్చిన వేదాళం మూవీ తమిళ్‌లో భారీ విజయాన్ని నమోదుచేసుకుంది. ఆ సినిమాలో అజిత్ రోల్ అక్కడి ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. దీంతో ఆ పాత్రకు తనకు సూటవుతుందని భావించిన మెగాస్టార్ ఈ మూవీ రీమేక్ లో నటించనున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతోన్న డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వ్యవహరిస్తాడని టాక్. ఇక ఇదే సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించనుందట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: