Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో తను కమిట్ అయిన దర్శకుడికి హ్యాండ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిరు, చరణ్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత చిరు.. లూసీఫర్ రీమేక్ షూటింగ్లో పాల్గొననున్నారు. అంతా బాగుంటే.. ఈ గురువారమే ఈ సినిమా విడుదలై ఉండేది. కానీ కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా ‘ఆచార్య’ విడుదలను కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలలోనే మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా చిరు లూసీఫర్, వేదాళం రీమేక్స్‌తో బిజీగా ఉన్నారు. ఇందులో వేదాళం కోసం మెహర్ రమేష్ ఫిక్స్ అయ్యారు. ఆయన కథను కూడా సిద్ధం చేసి ఉంచారు. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లు మెహర్ చేసిన మార్పులకు మెగాస్టార్ ఓకే కూడా చేసేసారు. రీసెంట్గా మెహర్ రమేష్ చిరంజీవి లేకుండా కొంత పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసినట్టు సమాచారం.
మెహర్ రమేష్. వేదాళం విషయంలో క్లారిటీగా ఉన్న చిరు.. లూసీఫర్ రీమేక్ విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ చిత్ర దర్శకుడి విషయంలో ముందు నుంచి కూడా ఎక్కడో క్లారిటీ మిస్ అవుతూ వస్తుంది. లూసీఫర్ రీమేక్‌కు ముందు సుజీత్‌ను దర్శకుడిగా తీసుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత సుజీత్‌ను కాదని వినాయక్‌ను తీసుకున్నారు చిరంజీవి.
అటు వినాయక్ చెప్పిన నేరేషన్ కూడా చిరంజీవికి నచ్చలేదట. దీంతో వినాయక్ .. బెల్లంకొండ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఛత్రపతి రీమేక్ బాధ్యతలను టేకప్ చేసారు. ఆ తర్వాత బాబీ కూడా ఈ కథను తనదైన ట్రీట్మెంట్తో చిరును కలిస్తే.. అతని చెప్పిన స్టైల్ కూడా చిరు సంతృప్తి వ్యక్త పరచలేదట. ఆ తర్వాత లూసీఫర్ రీమేక్ బాధ్యతలను చిరంజీవి.. హరీష్ శంకర్ చేతిలో పెడదామనుకున్నారు. కానీ హరీష్ శంకర్ తనకున్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా రీమేక్ చేయలేనని చెప్పారు. చివరకు ఈ రీమేక్ బాధ్యతలను తమిళంలో వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళుతున్న మోహన్ రాజాకు అప్పగించారు. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తాజాగా మోహన్ రాజా చెప్పిన లైనప్ చిరుకు నచ్చలేదని టాక్. రెండు సార్లు స్క్రీన్ ప్లే ఛేంజ్ చేసిన చిరు మాత్రం ఓకే చెప్పడం లేదట. దీంతో మోహన్ రాజా ఈ సినిమా రీమేక్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్నట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. దీంతో చిరు.. ఈ రీమేక్ ప్రాజెక్ట్‌ను ఎవరి చేతిలో పెడతారనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Chiranjeevi, K. S. Ravindra (Bobby), Koratala siva, Meher ramesh, Mohan Raja