Chiranjeevi Lucifer Remake: చిరంజీవి అభిమానులకు శుభవార్త.. ‘లూసీఫర్’ రీమేక్‌ షూటింగ్‌కు ముహూర్తం ఖరారు..

చిరంజీవి లూసీఫర్ రీమేక్‌ షూటింగ్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి  సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరు.. ‘ఆచార్య’ తర్వాత ‘లూసీఫర్’ రీమేక్‌ను పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఖరారైంది.

  • Share this:
    Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి  సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్.. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఆగష్టు మొదటి వారంలో ఈ  సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత చిరు.. లూసీఫర్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛంగా ప్రారంభమైంది.

    ఎపుడో పట్టాలెక్కాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అయింది. ఇక  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ పెడతామనుకున్నారు. కానీ ఒరిజినల్‌లో లాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటించడం లేదు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కోసం చూస్తున్నారు. ఇప్పటికే విజయశాంతి, నయనతార, అనుష్క వంటి పేర్లు పరిశీలించినా.. ఎవరు ఫైనల్ కాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే లోపు ఈ సినిమా కథలో కీలకమైన చిరు సిస్టర్ పాత్రను ఎవరు చేస్తారనేది ఫైనల్ చేస్తారట.  అంతేకాదు ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిఫుణులను త్వరలో  ఫైనలైజ్ చేసి అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

    Chiranjeevi Lucifer remake,Chiranjeevi Lucifer remake actress,Chiranjeevi Lucifer remake trisha,Chiranjeevi Lucifer remake nayanthara,Chiranjeevi Lucifer remake trisha sister,Chiranjeevi Lucifer remake heroine,Chiranjeevi Lucifer remake title,Chiranjeevi Lucifer remake shooting,చిరంజీవి,చిరంజీవి లూసీఫర్ రీమేక్,చిరంజీవి త్రిష లూసీఫర్ రీమేక్,చిరంజీవి చెల్లిగా త్రిష
    చిరంజీవి లూసీఫర్ రీమేక్‌కు క్రేజీ టైటిల్ (Twitter/Photo)


    ఈ సినిమా కోసం చిరంజీవి పలు క్రేజీ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఏ సినిమాకైనా టైటిలే ప్రధానం. పేరును బట్టి అది క్లాస్ మూవీనా.. మాస్ మూవీనా అని ప్రేక్షకులు కూడా ఓ అంచనాకు వస్తారు. అందుకే ఎంత మంచి సినిమా కైనా ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలంటే మంచి టైటిల్ ఉండాల్సిందే. తాజాగా చిరంజీవి కూడా తన చేయబోయే నెక్ట్స్ సినిమా ‘లూసీఫర్’ రీమేక్‌కు ఓ క్రేజీ టైటిల్‌ను అనుకుంటున్నారు.

    Chiranjeevi Remakes Megastar Done Many Remakes Before Lucifer Vedalam Here Are The List,Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..,Chiranjeevi,Megastar,Megastar Chiranjeevi,Chiranjeevi Remakes,Chiranjeevi Lucifer Remake,Vedhalam Remake,
    ‘లూసీఫర్’ రీమేక్‌లో చిరంజీవి (Twitter/Photo)


    పూర్తి పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘రారాజు’ అనే టైటిల్ ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత అటు ‘బైరెడ్డి’, బిగ్ బ్రదర్’, బ్రహ్మరథం’ కింగ్ మేకర్’  అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినా.. వాటిని తన కనుసైగలతో శాసిస్తూ ఉంటారు. సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలో.. లేదో అతనే డిసైడ్ చేస్తాడు. ఈ నేపథ్యంలో ఈ  సినిమాకు ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని చెబుతున్నారు.

    chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi acharya movie laahe laahe song,ఆచార్య ఫస్ట్ సాంగ్,ఆచార్య లాహే లాహే సాంగ్,చిరంజీవి ఆచార్య సాంగ్
    చిరంజీవి ఆచార్య సాంగ్ (Chiranjeevi Acharya)


    లూసీఫర్ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎంతో మందిని అనుకోని చివరకు తమిళంలో ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తెలుగువాడైన మోహన్ రాజాకు అప్పగించాడు. ఇక మోహన్ రాజా చేసిన దాదాపు అన్ని సినిమాలు రీమేక్ కథలు కావడం విశేషం. ఇక చిరు విషయానికొస్తే.. ఈ ఏజ్‌లో కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే ఒక భాషలో ప్రూవ్ కథతో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ వుంటుందన్న ఉద్దేశ్యంతో చిరంజీవి వరుసగా రీమేక్ సినిమాలకు ఓకే చెబుతున్నారు.

    Megastar Chiranjeevi With Directors Koratala Siva Meher Ramesh Mohan Raja Bobby photos goes Viral Chiranjeevi: కొరటాల శివ, మెహర్ రమేష్, మోహన్ రాజా, బాబీలతో మెగాస్టార్ చిరంజీవి..,chiranjeevi,Chiranjeevi Koratala Siva Meher Ramesh Mohan Raja Bobby,chiranjeevi twitter,chiranjeevi another remake,Chiranjeevi Koratala Siva,Chiranjeevi Bobby,Chiranjeevi Mohan Raja,chiranjeevi meher ramesh,meher ramesh,bobby,koratala siva,mohan Raja,chiranjeevi ajith ennai erindal,chiranjeevi prashanth varma movie,chiranjeevi acharya movie,chiranjeevi bobby movie,chiranjeevi sujeeth,chiranjeevi meher ramesh,chiranjeevi parasuram,chiranjeevi harish shankar movie,chiranjeevi ks ravindra movie,chiranjeevi ks ravindra mythri movie makers movie,chiranjeevi facebook,chiranjeevi sardar director bobby,chiranjeevi koratala siva movie,chiranjeevi about venky mama,chiranjeevi about venkymama,chiranjeevi next movie,chiranjeevi speech,chiranjeevi upcoming movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కెయస్ రవీంద్ర,చిరంజీవి మెహర్ రమేష్,చిరంజీవి హరీష్ శంకర్,చిరంజీవి పరశురామ్,చిరంజీవి సుజీత్,చిరంజీవి బాబీ సినిమా,చిరంజీవి ప్రశాంత్ వర్మ సినిమా,అజిత్ ఎంతవాడు కానీ సినిమాను రీమేక్ చేయనున్న చిరంజీవి,చిరంజీవి బాబీ,చిరంజీవి మోహన్ రాజా,చిరంజీవి మోహన్ రాజా లూసీఫర్,చిరంజీవి మెహర్ రమేష్,చిరంజీవి బాబీ,బాబీ,మోహన్ రాజా,కొరటాల శివ,మెహర్ రమేష్
    తన సినిమా దర్శకులతో మెగాస్టార్ చిరంజీవి


    మొత్తంగా చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్‌కు  ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక దర్శకుడు మోహన్ రాజా విషయానికొస్తే.. ఈయన  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు కూడా. ఈయన తండ్రి ఎడిటర్ మోహన్.. తెలుగులో చిరంజీవితో అప్పట్లో హిట్లర్ సినిమాను తెరకెక్కించారు. ఇక మోహన్ రాజా దర్శకుడిగా తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’తో మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆతర్వాత తన తమ్ముడు జయం రవితో వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తమిళంలో తన తమ్ముడితో తెరకెక్కించి సక్సెస్ సాధించారు. అంతేకాదు రీమేక్‌లను హ్యాండిల్ చేయడంలో మంచి పట్టు సాధించాడు మోహన్ రాజా. అందుకే చిరంజీవి తన లేటెస్ట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలను మోహన్ రాజా చేతిలో పెట్టారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: