Chiranjeevi: లూసిఫర్ తెలుగు రీమేక్‌పై కొన్ని రోజులు వస్తోన్న వార్తలకు చెక్ పడింది. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ఈ మూవీకి దర్శకుడు ఖరారు అయ్యారు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, హీరో జయం రవి సోదరుడు మోహన్ రాజా లూసిఫర్ రీమేక్ బాధ్యతలను తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఎన్వీఆర్ సినిమాస్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు సంక్రాంతి తరువాత ఈ మూవీ షూటింగ్‌లో చిరంజీవి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
కాగా మలయాళంలో మోహన్‌లాల్ నటించిన లూసిఫర్ అక్కడ పెద్ద విజయాన్ని సాధించింది. పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ మూవీని చూసిన రామ్ చరణ్.. చిరంజీవి కోసం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి దర్శకుడిగా మొదట సాహో దర్శకుడు సుజీత్ ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకోగా.. ఆ తరువాత చిరుకు ఎంతో ఇష్టమైన వివి వినాయక్ లైన్‌లోకి వచ్చారు. అయితే కొన్ని కారణాల వలన వినాయక్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా ఇప్పుడు మోహన్ రాజా కన్ఫర్మ్ అయ్యారు.
#MegaStar153 #Lucifer Telugu Remake Will Be Directed By @Jayam_Mohanraja #MegaStar @KChiruTweets Will Join the Sets Soon After Sankranthi 2021. Nv Prasad Under NVR Cinema & @KonidelaPro will Jointly Produce it. More Details Soon.. @NVRCinema pic.twitter.com/HiATeMZ3Xt
— BARaju (@baraju_SuperHit) December 16, 2020
ఇక కోలీవుడ్‌లో మోహన్‌రాజాకు మంచి పేరుంది. తన సోదరుడు జయం రవి నటించిన పలు చిత్రాలకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. 2001లో హనుమాన్ జంక్షన్ మూవీ ద్వారా ఈ దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. కాగా తనిఒరువన్(తెలుగులో ధృవగా రీమేక్ అయ్యింది)తో మోహన్ రాజాకు మంచి పేరొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం.. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Megastar Chiranjeevi, Tollywood, Tollywood Movie News, Tollywood news