CHIRANJEEVI KORATALA SIVA MOVIE SHOOTING STARS FROM JUNE TA
లాక్డౌన్ తర్వాత చిరంజీవి, కొరటాల శివ సినిమా షూటింగ్‌కు ముమూర్తం ఫిక్స్..
చిరంజీవి, కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)
దేశ వ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న వేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా లాక్డౌన్ తర్వాత చిరంజీవి, కొరటాల శివ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది.
దేశ వ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న వేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. ఈ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు, సీరియల్స్ షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. గత రెండు నెలలుగా సినిమా నటీనటులు టెక్నీషియన్స్ ఇంటికే పరిమితమయ్యారు. ఐతే.. రీసెంట్గా టాలీవుడ్ పెద్దలతో చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా షరుతులతో కూడిని షూటింగ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా సెట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. జూన్ నుంచి షూటింగ్స్ మొదలు పెట్టడానికి టాలీవుడ్ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటగా చిరంజీవి, కొరటాల శివ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానున్నట్టు సమాచారం. జూన్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా చేయడానికి ఇప్పటి నుంచే నిర్మాత రామ్ చరణ్ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ తర్వాత షూటింగ్ మొదలు కానున్న పెద్ద చిత్రము ఇదే కానుంది. ఆ తర్వాత రాజమౌళి.. నటీనటుల డేట్స్ ప్రకారం నెక్ట్స్ షెడ్యూల్ ఖరారు చేయనున్నట్టు సమాచారం.
చిరంజీవి,కొరటాల శివ (Chiranjeevi Koratala Siva)
చిరంజీవి, కొరటాల శివ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని కొరటాల శివ దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఆచార్య పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.