news18-telugu
Updated: April 24, 2020, 3:39 PM IST
సినీ పరిశ్రమలో డేరింగ్‌గా వచ్చి డాషింగ్ హీరోగా మారి...ఎన్నో డైనమిక్ హిట్స్ ఇచ్చిన చిరంజీవి... 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో జన్మించాడు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్.
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఆచార్య' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా కరోనా వైరస్ కారణంగా ఆచార్య షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. కరోనా ప్రభావం కొంత తగ్గిన తర్వాత మే నుండి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం. ఇక సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆచార్యను దసరాకు విడుదల చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ పండుగ రెండు రాష్ట్రాలకు పెద్ద పండుగే కనుక ఈ దసరాను టార్గెట్ చేసుకుని విడుదల చేస్తే బాగుంటుందని.. ఆ విధంగా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారని సమాచారం. అంతేకాదు దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండే ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. దీనికి సంబందించిన ఆ పాటను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. ఆచార్యలో ముందునుండి త్రిషను అనుకుంటే ఆమె ఏవో కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కాజల్‌ను తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఇక అది అలా ఉంటే ఆచార్య షూటింగ్లో ఉండగానే చిరంజీవి మరో సినిమాకు ఓకే చెప్పారు. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో క్రితం ఏడాది వచ్చిన 'లూసిఫర్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. దాంతో ఈ సినిమాను చిరంజీవితో తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే ఆసక్తి మెగా అభిమానుల్లో మొదలైంది. అందులో భాగంగా ఓ దశలో వినాయక్ పేరు కూడా వినిపించింది. కాగా ఆ సినిమా తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించే భాద్యతను యువ దర్శకుడు సుజీత్ కి అప్పగించినట్టుగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు. తెలుగు వర్షన్లో ఇక్కడ నెటీవిటికి తగ్గట్లు తగినన్ని మార్పులు చేస్తూన్నడట సుజీత్.
Published by:
Suresh Rachamalla
First published:
April 24, 2020, 3:39 PM IST