హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi | God Father : గాడ్ ఫాదర్ షూటింగ్‌లో పాల్గోన్న చిరంజీవి.. వైరలవుతోన్న పిక్స్..

Chiranjeevi | God Father : గాడ్ ఫాదర్ షూటింగ్‌లో పాల్గోన్న చిరంజీవి.. వైరలవుతోన్న పిక్స్..

Chiranjeevi | God Father : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi | God Father : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi | God Father : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈసినిమాలో చిరంజీవి ఈరోజు నుంచి షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా నుంచి చిరంజీవి కోలుకోవడంతో ఆయన షూటింగ్‌‌లో ఉత్సాహాంగా పాల్గోంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్ తదితరులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపు 45 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

    ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నారట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను కూడా యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

    ఇక చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మరో సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 152వ చిత్రాన్ని చేస్తున్నారు. ఆచార్య ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఓ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

    First published:

    Tags: Chiranjeevi, God Father Movie, Nayanthara, Tollywood news

    ఉత్తమ కథలు