Home /News /movies /

CHIRANJEEVI IS CONFIRMED AS CHIEF GUEST FOR BIGG BOSS 4 GRAND FINALE MNJ

Chiranjeevi: బిగ్‌బాస్ వీక్ష‌కుల‌కు గుడ్‌న్యూస్‌.. రెండోసారి అతిథిగా రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి

ఈ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రత్యేక గెస్ట్‌గా వచ్చి విన్నర్‌, రన్నర్‌ను ప్రకటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బిగ్‌బాస్-03(Bigg Boss 3) ఫినాలేకు విచ్చేసిన మెగస్టార్ తన చేతుల మీదుగానే విన్నర్ ఎవరో ప్రకటించి

ఇంకా చదవండి ...
    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-4 మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. దీంతో విన్నర్ ఎవరు..? రన్నర్ ఎవరు..? అని అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికంటే ఎక్కువగా విన్నర్‌ను ఎవరు ప్రకటిస్తారా అనేదానిపై బిగ్‌బాస్ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలేకు ఎవరో ఒకరు సీనియర్ హీరో వచ్చి విన్నర్ ఎవరు..? రన్నర్ ఎవరూ అనేదాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఎవరొస్తారా అని ఆరా తీయగా... ఇంట్రెస్టింగ్ విషయం వెలుగుచూసింది.

    ఈ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గెస్ట్‌గా వచ్చి విన్నర్‌, రన్నర్‌ను ప్రకటించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బిగ్‌బాస్-03 ఫినాలేకు విచ్చేసిన మెగస్టార్ తన చేతుల మీదుగానే విన్నర్ ఎవరో ప్రకటించి.. రాహుల్ సిప్లిగంజ్‌కు ట్రోపీ అందజేశారు. అయితే నాల్గవ సీజన్‌కు చిరునే వచ్చి ట్రోపీ అందజేస్తారట. ఇప్పటికే దీనిపై హోస్ట్ అక్కినేని నాగార్జున- చిరంజీవి ఇద్దరూ చర్చించుకున్నారట. చిరు కూడా డేట్స్ కూడా ఇచ్చేశారట. మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేదా.. మహేశ్ బాబును పిలవాలని ‘మా’ టీవీ యాజమాన్యం భావించినప్పటికీ వారిద్దరూ బిజిబిజీగా ఉండటం.. డేట్స్ ఇవ్వలేకపోవడం.. పైగా సీనియర్ హీరో కనుక మెగాస్టార్‌నే పిలిస్తే గౌరవంగా ఉంటుందనే ఉద్దేశంతో నాగ్, యాజమాన్యం ఆహ్వానించారట. మారుమాట చెప్పకుండానే చిరు ఓకే చెప్పేశారట.

    కాగా.. మా టీవీకి చిరుకు మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే మెగాస్టార్ కాదనకుండా పిలవగానే ఓకే చెప్పారట. ప్రస్తుతం ఫినాలేకు సంబంధించి ఎపిసోడ్ అంతా రెడీ చేస్తున్నారట. ఆదివారం నాడు ఈ ఎపిసోడ్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సారి ఏకంగా మూడు గంటల పాటు షోను ప్రసారం చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఫినాలేకు సంబంధించి అధికారిక ప్రకటన లేదా ప్రోమోను యాజమాన్యం విడుదల చేస్తారట. ఈ సారి చిరు చేతుల మీదుగా ట్రోపీ అందుకునే ఆ విన్నర్ ఎవరో తెలియాలంటే మరో 48 గంటలు వేచి చూడాల్సిందే.
    Published by:Manjula S
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Chiranjeevi, Megastar Chiranjeevi, Television News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు