హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi: డియర్ శృతి అంటూ చిరంజీవి పోస్ట్.. వైరల్ అవుతున్న మెసేజ్

Chiranjeevi: డియర్ శృతి అంటూ చిరంజీవి పోస్ట్.. వైరల్ అవుతున్న మెసేజ్

Chiranjeevi Shruthi Haasan (Photo twitter)

Chiranjeevi Shruthi Haasan (Photo twitter)

Shruti Haasan Birth day: శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు స్పెషల్ విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ మెసేజ్ చూసి శృతికి పెద్ద ఇటున విషెస్ చెబుతున్నారు మెగా ఫ్యాన్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నేడు (జనవరి 28) స్టార్ హీరోయిన్ శృతిహాసన్ పుట్టిన రోజు (Shruti Haasan Birth day). తన 37వ బర్త్ డే జరుపుకుంటోంది శృతి. స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. కెమెరా ముందు తన టాలెంట్ చూపించి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. దీంతో అమ్మడికి సపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై తన మార్క్ చూపించింది. అయితే శృతి బర్త్ డే సందర్భంగా ఆమెకు స్పెషల్ విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది.

డియర్ శృతి.. రాబోయే ఏడాది నీ కెరీర్ మరింత విజయవంతంగా దూసుకుపోవాలని, నీ టాలెంట్ తో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా అని పేర్కొంటూ వాల్తేరు వీరయ్య సినిమాలోని ఓ స్టిల్ షేర్ చేశారు చిరంజీవి . దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. చిరు పెట్టిన ఈ మెసేజ్ చూసి మెగా అభిమానులు పెద్ద ఎత్తున శృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

1986 జనవరి 28న శృతి హసన్ జన్మించింది. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్. స్వతహాగా సింగర్ అయిన శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి.. బాల నటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత లక్ మూవీతో బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో భాగమవుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే కొన్నేళ్ల పాటు కెరీర్ పరంగా కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్న శృతి హాసన్.. ఈ ఏడాది సంక్రాంతి వేళ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి సరసన ఆడిపాడి భారీ విజయాలు ఖాతాలో వేసుకుంది. దీంతో ఒక్కసారి శృతిహాసన్ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది శృతి. ఆధ్యా పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సలార్ లో శృతి రోల్ సినిమా మేజర్ హైలైట్స్ లో ఒకటి కానుందని సమాచారం.

First published:

Tags: Chiranjeevi, Shruthi haasan, Waltair Veerayya

ఉత్తమ కథలు