Home /News /movies /

CHIRANJEEVI INTERESTING COMMENTS ON RAJAMOULI HEROS FLOP SENTIMENT SB

రాజమౌళి సినిమా చేసిన హీరోకు ఆ తర్వాత ప్లాప్.. చిరంజీవి ఇంట్రస్టింగ్ కామెంట్స్

రాజమౌళి చిరంజీవి

రాజమౌళి చిరంజీవి

రాజమౌళి రామ్ చరణ్‌తో ఆర్ఆర్ఆర్ చేసిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఆచార్య. దీంతో ఈ సినిమాకు ఇప్పుడు పాత సెంటిమెంట్ వెంటాడుతోంది.

    ఆచార్య ప్రి రిలీజ్ వేడుక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రాజమౌళిని ఉద్దేశించి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచారని ప్రశంసలు కురిపించారు. ఈ వేడుకకు వచ్చిన రాజమౌళికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. వేదికపై రాజమౌళిని ఘనంగా సన్మానించారు. ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లు దోహదపడ్డాయన్నారు మెగాస్టార్. అలాంటి సినిమాల నిర్మాణ కర్త రాజమౌళి ఇక్కడ ఉండటం తనకెంతో గర్వంగా ఉందన్నారు.

    జీవితాంతం తెలుగు సినిమా రాజమౌళిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. భారతీయ సినిమా ఒక మతం అయితే, ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి. ‘ఆచార్య’ సినిమాలోకి నేను రావడానికి కారణం రాజమౌళినే కారణం. ఈ విషయం రాజమౌళికి కూడా తెలియదు’’అంటూ ఆచార్య చిరు... చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ చిరు రాజమౌళి హీరోలను వెంటాడుతున్న సెంటిమెంట్‌పై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి రాజమౌళి సినిమాలో నటించి హిట్ కొట్టిన హీరోకు ఆ తర్వాత సినిమా ప్లాప్ అవుతుందని టాక్ నడుస్తోంది. ఇది చాలామంది హీరోల విషయంలో నిజమైంది.

    జూనియర్ ఎన్టీఆర్‌తో 2001లో రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీశారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన ఎన్టీఆర్ మరో సినిమా సుబ్బు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో ప్లాప్ అని చెప్పాలి. 2003లో మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి సింహాద్రి తీశారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆంధ్రావాలా మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. 2007లో అదే ఎన్టీఆర్‌తో జక్కన్న యమదొంగ తీశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత 2008లో ఎన్టీఆర్ చేసిన కంత్రీ సినిమా బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా పడింది.

    ఇక 2005లో రాజమౌళి ప్రభాస్ కాంబోలో వచ్చిన మూవీ ఛత్రపతి.. ఈ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈసినిమా తర్వాత ప్రభాస్ చేసిన పౌర్ణమి మళ్లీ ప్లాప్ అయ్యింది. ఛత్రపతి తర్వాత రాజమౌళి మరోసారి ప్రభాస్‌తో చేసిన సినిమా బాహుబలి, బాహుబలి 2.ఇక ఈ సినిమా ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో వచ్చిన సాహో మూమీ మాత్రం ప్రభాస్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇలా ఈ చాలామంది హీరోల విషయంలో ఇదే జరిగింది.

    ఇక రామ్ చరణ్‌తో కూడా రాజమౌళి గతంలో మగధీర సినిమా తెరకెక్కించారు. 2009 మగధీరను సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా చూపించారు. ఇందులో కాల భైరవగా రామ్ చరణ్ నటన అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత 2010లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింద. సినిమా పాటలు హిట్ అయినా మూవీ మాత్రం ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ మరోసారి ఆర్ఆర్ఆర్‌తో రాజమౌళి సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్యలో నటిస్తున్నాడు. దీంతో ఆచార్య సినిమాపై అనేక రకాల సందేహాలు నెలకొన్నాయి.

    అయితే ఈ సెంటిమెంట్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాతి సినిమా ఫ్లాప్‌ వస్తుందని అందరూ అనుకుంటారు. అది వాస్తవం కాదు. అలాంటి వాటిని తాను నమ్మనన్నారు. అలా అనుకునే వాళ్లను చెబుతున్నా, ఆ ఊహను ‘ఆచార్య’ తుడిచిపెట్టేస్తుంది. ఇది మళ్లీ ఒక హిట్‌ అవుతుంది. మీరు కచ్చితంగా చూస్తారు. ఏప్రిల్‌ 29న ఆస్వాదిస్తారు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. మరి రాజమౌళి హీరోల సెంటిమెంట్‌ను ఆచార్య సినిమాతో చిరంజీవి.. రామ్ చరణ్ బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఆచార్య హిట్ అయితే.. రామ్ చరణ్ రాజమౌళి హీరోల సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడనే చెప్పొచ్చు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chiranjeevi, Raja mouli, Ram Charan, SS Rajamouli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు