Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: April 5, 2020, 2:38 PM IST
చిరంజీవి మహేష్ బాబు (Source: Chiranjeevi Mahesh Babu)
చిరంజీవి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆచార్యలో కీలక పాత్ర కోసం సూపర్ స్టార్‌ను తీసుకుని రెమ్యునరేషన్ ఎక్కువ అడిగాడనే నెపంతో మహేష్‌ను కాదన్నారనే ప్రచారం కూడా జరిగింది. బడ్జెట్ పరిమితులతో రామ్ చరణ్ ఈ సినిమాలో ఆ పాత్ర చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అన్ని అనుమానాలకు సమాధానం ఇచ్చాడు. అసలు తన సినిమాలో మహేష్ బాబును తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని.. అసలు ఆ పాత్రకు మహేష్‌ను అనుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

చిరంజీవి మహేష్ బాబు (Source: Chiranjeevi Mahesh Babu)
అసలు ఆ పాత్ర కోసం సూపర్ స్టార్ పేరు ఎలా బయటికి వచ్చిందో కూడా తనకు తెలియదని చెప్పాడు మెగాస్టార్. మహేష్ నాకు బిడ్డతో సమానం.. అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశమే అని చెప్పాడు చిరు. కానీ ఆచార్యలో మాత్రం మహేష్ బాబును అనుకోలేదని చెప్పాడు ఈయన. ముందు నుంచి కూడా ఈ పాత్ర రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని కొరటాల కూడా భావించాడని.. అదే వాళ్ల అమ్మ సురేఖ కోరిక కూడా అని చెప్పాడు మెగాస్టార్. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న చరణ్.. తన సినిమాలో నటించాలంటే రాజమౌళి ఒప్పుకోవాలని చెప్పాడు.

అత్తా మామ చిరంజీవి,సురేఖలతో రామ్ చరణ్ ఉపాసన (Twitter/Photo)
దీనికి కొరటాల, రాజమౌళి కాంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యం అవుతుందని చెప్పాడు చిరు. అయితే తన సినిమాలో మహేష్ లేకపోయినా రామ్ చరణ్ ఉన్నాడనే విషయం మాత్రం ఒప్పుకున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ కొణిదెల బ్యానర్‌తో కలిసి కాగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు కాదు కానీ కచ్చితంగా భవిష్యత్తులో మాత్రం నేను, మహేష్ కలిసి నటిస్తామని చెబుతున్నాడు చిరంజీవి.
Published by:
Praveen Kumar Vadla
First published:
April 5, 2020, 2:38 PM IST