మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ దర్శకత్వలో వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మౌత్ టాక్ వల్ల వాల్తేరు వీరయ్య మిగితా సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు ఓవర్సీస్లో ముఖ్యంగా అమెరికాలో మంచి వసూళ్లను సాధిస్తుంది. ఈ క్రమంలో చిరంజీవి అక్కడి ఫ్యాన్స్‌తో మాట్లాడారు. అమెరికాలోని పలు రాష్ట్రాలకు చెందిన తన అభిమానులను ఆన్ లైన్ ద్వారా కలుసుని వారితో ముచ్చటించారు. చిరంజీవి లైవ్ లో ఉన్నప్పుడే కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు ఎన్నారై అభిమానులు. మీ అభిమానం వల్లే ఇంతటి విజయం సాధ్యమైంది అంటూ చిరు ఆనందం వ్యక్తం చేశారు. 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ వేడుకల్లో 28 నగరాల్లోని మెగా అభిమానులు పాల్గొన్నారు. మెగాస్టార్ ఆన్ లైన్ ద్వారా కలుసుకుని ఎన్నారై అభిమానులతో సెలెబ్రేట్ చేసుకోవడం ఇదే తొలిసారి. న్యూజెర్సీలోని 'రేగల్' మూవీ థియేటర్ కేంద్రంగా వెంకట్ రత్నకుమార్ చవ్వకుల, గోపి గుర్రం.శివ సింగరపు ఈ మెగా సెలెబ్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, సియాటెల్, పోర్ట్ ల్యాండ్, బే ఏరియా, లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, డెన్వర్, చికాగో, మిన్నియాపాలిస్, సెయింట్ లూయిస్, కాన్సాస్ సిటీ, డెట్రాయిట్, కొలంబస్, అట్లాంటా, న్యూజెర్సీ, షార్లెట్, రాలీ, బోస్టన్, టొరంటో, వర్జీనియా, మాంచెస్టర్, ఫిలడెల్ఫియా, పిట్స్బర్గ్, మేరీల్యాండ్, టొరంటో.. వంటి రాష్ట్రాలతో పాటు కెనడాకు చెందిన మెగా అభిమానులు చిరంజీవితో లైవ్‌లో ముచ్చటించారు.
Annayya #Chiranjeevi garu Interaction with #USA fans through Zoom Call.#WaltairVeerayya
Boss @KChiruTweets@RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP#BlockbusterWaltairVeerayya pic.twitter.com/70CRVKdSJ2 — Chiranjeevi Army (@chiranjeeviarmy) January 23, 2023
ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదలైంది. ఫస్ట్ డే మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఒక్క నైజాం ఏరియానే కాదు.. అటు సీడెడ్, ఉత్తరాంధ్రలోను మంచి బుకింగ్స్ నమోదు అయ్యాయి.. అంతేకాదు ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది. దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకు ముందు 2 మిలియన్ అందుకున్న చిరంజీవి ఇతర సినిమాలు సైరా, ఖైదీ నెంబర్ 150లుగా ఉన్నాయి. ఈ సినిమా అక్కడ 2.5 మిలియన్ డాలర్స్‌ను ఇప్పటి వరకు అందుకుంది. త్వరలో 3 మిలియన్ వరకుచేరుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఎప్పుడో బ్రేక్ ఈవెన్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం లాభాలను తెచ్చిపెడుతోంది. వీరయ్య 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా ఇప్పటి వరకు అంటే పదకొండో రోజు వరకు 28.03 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని 117.03 కోట్ల షేర్‌ను 200.70 కోట్ల గ్రాస్‌ను అందుకుని అదరహో అనిపించింది. ఇంకా మంచి వసూళ్లు రావడంతో లాంగ్ రన్లో వీరయ్య మరో 15-20 కోట్ల రేంజ్లో ప్రాఫిట్‌ను అందుకునే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. చూడాలి మరి ఏ రేంజ్లో ఈ సినిమా వసూలు చేయనుందో..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Waltair Veerayya