అమితాబ్ ఇచ్చిన అమూల్యమైన సలహాను పట్టించుకోని చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి .. అమితాబ్ బచ్చన్ ఇచ్చిన అమూల్యమైన సలహాను పెడ చెవిన పెట్టాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 28, 2019, 7:56 PM IST
అమితాబ్ ఇచ్చిన అమూల్యమైన సలహాను పట్టించుకోని చిరంజీవి..
ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా ఒప్పుకున్నాడు అమితాబ్ బచ్చన్. నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే నటించడానికి ఓకే చెప్పేసాడు ఈయన. దాంతో బాలయ్య అభిమానులకు మరింత మండిపోతుంది. తమ హీరోకు అడ్డొచ్చిన భాష.. ఇప్పుడు మిగిలిన సినిమాలకు రావడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి .. అమితాబ్ బచ్చన్ ఇచ్చిన అమూల్యమైన సలహాను పెడ చెవిన పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్ భాగంగా అమితాబ్, చిరంజీవిలను ఈ సినిమా హిందీ వెర్షన్‌‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఫర్హాన్ అఖ్తర్ వీళ్లిద్దరిని ఇంటర్వ్యూ చేసారు. ఈ సందర్భంగా అమితాబ్, చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ముందుగా అమితాబ్ మాట్లాడుతూ.. చిరంజీవితో తన పరిచయం ‘హమ్’ షూటింగ్ ఊటీలో జరగుతుండగా అక్కడ చిరంజీవి కలిసానన్నారు. అదే సమయంలో చిరంజీవి తను హిందీలో మొదటి సారి డైరెక్ట్‌గా నటించిన ‘ప్రతిబంధ్’ సినిమా అమితాబ్‌కు చూపించాలని అపాయింట్‌మెంట్ కోరాను. అలా ఇద్దరం ఊటీలో తొలిసారి కలుసుకున్నామన్నారు. మరోవైపు బిగ్‌బీ మాట్లాడుతూ.. నేను చిరంజీవి గారికి ఎన్నో సలహాలు ఇచ్చాను. కానీ ఆయన పాటించలేదు. పాలిటిక్స్‌లోకి వెళ్లొద్దని సలహా ఇచ్చాను కానీ ఆయన పాటించలేదు అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  అప్పట్లో తాను కూడా రాజకీయాల్లోవెళ్లి ఎన్నో ఇబ్బందులను ఎదర్కున్నాను. నా లాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని చిరుకు ఈ సలహా ఇచ్చానన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 28, 2019, 7:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading