CHIRANJEEVI HUG TO VIJAYASHANTI IN SARILERU NEEKEVVARU PRE RELEASE EVENT TA
విజయశాంతి నా హీరోయిన్.. స్టేజ్ పై లేడీ అమితాబ్‌ను హగ్ చేసుకున్న చిరంజీవి..
’సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయశాంతిని హగ్ చేసుకున్న చిరు (Youtube/Credit)
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. విజయశాంతిని తన హీరోయిన్ అంటూ తనతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించందని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.అంతేకాదు స్టేజ్ పై విజయశాంతిని హగ్ చేసుకున్నాడు.
‘సరిలేరు నీకెవ్వరు’ వేదిక చిరంజీవి, విజయశాంతి మయం అయింది. ఈ వేదికపై చిరంజీవి.. విజయశాంతిపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. విజయశాంతిని తన హీరోయిన్ అంటూ తనతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించందని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు గెలుచుకుందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతేకాదు సండే అననురా.. మండే అననురా అంటూ గ్యాంగ్ లీడర్ సినిమా పాటను చిరు ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో తనను తిట్టిన సందర్భాన్ని చిరంజీవి గుర్తు చేసారు. నన్ను ఎలా తిట్టావు విజయశాంతి అని చిరు చిన్నపిల్లాడిలా తన ఆవేదన వ్యక్తం చేసారు.
’సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయశాంతిని హగ్ చేసుకున్న చిరు (Youtube/Credit)
మరోవైపు విజయశాంతి మాట్లాడుతూ.. రాజకీయాలు, సినిమాలు వేరని చిరుకు గుర్తు చేసింది విజయశాంతి. ఆ తర్వాత చిరు మాట్లాడుతూ... 13 ఏళ్ల తర్వాత విజయశాంతిని చేస్తుంటే.. ఆమెలో అదే పొగరు, అదే ఫిగరు అని కాస్త సరసంగా చిరంజీవి ప్రస్తావించడం అందరినీ ఆశ్యర్యపోయేలా చేసింది. అంతేకాదు వీళ్లిద్దరు కలిసి నటించిన పాత సినిమాలను ఈ సందర్భంగా గుర్తు చేసారు. మొత్తంగా స్టేజ్‌పై విజయశాంతిని చిరు హగ్ చేసుకోవడం ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది.