మోహన్ బాబుతో ట్విట్టర్‌లో చిరు మెగా సరసాలు..

Chiranjeevi Mohan Babu: తెలుగు ఇండస్ట్రీలో టామ్ అండ్ జెర్రీ అంటే మరో మాట లేకుండా చిరంజీవి, మోహన్ బాబు అని చెప్తుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి సరదా సంఘటనే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 4:08 PM IST
మోహన్ బాబుతో ట్విట్టర్‌లో చిరు మెగా సరసాలు..
చిరంజీవి మోహన్ బాబు ఫైల్ ఫోటోస్ (Source: Twitter)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో టామ్ అండ్ జెర్రీ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పరిచయం ఉన్న వాళ్లెవ్వరైనా కూడా మరో మాట లేకుండా చిరంజీవి, మోహన్ బాబు అని చెప్తుంటారు. అది వాళ్ల బంధం కూడా. మీడియా ముందు కొట్లాడుకున్నా.. తిట్టుకున్నా కూడా తర్వాత మళ్లీ అంతా సరదగా తీసుకుంటారు. మా రెండు కుటుంబాలు ఒక్కటే అంటారు. అలాగే ఉంటారు కూడా. ఇప్పుడు కూడా ఇలాంటి సరదా సంఘటనే జరిగింది. తాజాగా చిరంజీవి ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఉగాది సందర్భంగా వచ్చిన ఈయనకు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఊహించని స్పందన వచ్చింది.

హీరో హీరోయిన్లు అనే తేడా లేకుండా అందరూ చిరంజీవికి స్వాగతం పలికారు. అందులో మోహన్ బాబు కూడా ఉన్నాడు. స్వాగతం మిత్రమా అంటూ చిరంజీవికి మోహన్ బాబు ట్వీట్ చేసాడు.. దానికి చిరు నుంచి కూడా అలాంటి స్పందనే వచ్చింది. థ్యాంక్యూ మిత్రమా అంటూనే రాననుకున్నావా.. రాలేననుకున్నావా అంటూ ఇంద్ర సినిమా డైలాగ్ కొట్టాడు. ఇది చూసిన అంతా నవ్వుకున్నారు. ఆ మధ్య మా డైరీ ఆవిష్కరణ సభలో చిరంజీవిపై కొన్ని ఛలోక్తులు విసిరాడు కలెక్షన్ కింగ్. అంతకుముందు మైక్ తీసుకుని వయో వృద్ధులు అంటూ మోహన్ బాబును ఆట పట్టించాడు మెగాస్టార్.

మోహన్ బాబు, చిరంజీవి (Twitter/Photo)
మోహన్ బాబు, చిరంజీవి (Twitter/Photo)

ఆ తర్వాత ఈయన మాట్లాడుతూ చిరంజీవితో ఆడుకున్నాడు. సరదాగా కాసేపు మాట్లాడిన తర్వాత చిరంజీవి వ్యక్తిగత విషయాలపై కూడా జోకులు పేల్చాడు మోహన్ బాబు. బయట చిరంజీవి అందరికి పులి కానీ ఇంట్లో మాత్రం అలా కాదు.. ఆయన అక్కడ పిల్లి.. మా చెల్లి సురేఖను చూస్తే చిరంజీవికి హడల్ అంటూ కామెడీ చేసాడు. దాంతో వెంటనే వెనక నుంచి చిరంజీవి కలగజేసుకుని.. కొంగు పట్టుకుని తిరుగుతాను అనేది మాత్రం చెప్పొద్దు బాబూ అంటూ సెటైర్ వేసాడు. ఇలా ఉంటుంది మా మధ్య అనుబంధం అంటూ చిరు, మోహన్ బాబు చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు.


First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు