చిరంజీవి పెద్ద మనసు.. అభిమాని గుండె ఆపరేషన్ కోసం మెగా సాయం..

MegaStar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన వంతుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నెలకొల్పి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తాజాగా ఓ మహిళా అభిమానిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు.

news18-telugu
Updated: April 7, 2020, 1:15 PM IST
చిరంజీవి పెద్ద మనసు.. అభిమాని గుండె ఆపరేషన్ కోసం మెగా సాయం..
మహిళా అభిమానికి చిరంజీవి సాయం (File/Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన వంతుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నెలకొల్పి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తాజాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పని లేకుండా పోయిన సినీ  కార్మికుల కోసం  కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసాడు. ఈ ఛారిటీకి బాలకృష్ణ సహా ప్రతి ఒక్క హీరో తన వంతుగా ఆర్ధిక సాయం అందించారు. తాజాగా చిరంజీవి.. గుంటూరు జిల్లా చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలుగా సేవలందిస్తోన్న కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమె గుండె ఆపరేషన్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే చిరంజీవి సదరు అభిమానిని హైదరాబాద్‌కు రప్పించే ఏర్పాట్లు చేసారు. ఇక్కడ ఫేమస్ హార్ట్ సర్జన్‌తో ఆమె గుండె ఆపరేషన్‌కు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రేపు ఆమెకు గుండె ఆపరేషన్ చేసే అవకాశాలున్నాయి. అంతేకాదు హైదరాబాద్‌లో సదరు మహిళ అభిమాని నాగలక్ష్మిక్ి  కావాల్సిన అన్ని ఏర్పాట్లను చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. మొత్తంగా చిరంజీవి తనను ఎంతో అమితంగా ఇష్టపడే అభిమానుల ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ద తీసుకోవడం చూసి అందరు మెగాస్టార్‌ను ఔదార్యాన్ని మెచ్చుకుంటున్నారు.

First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading