CHIRANJEEVI HAD A SPECIAL RELATION WITH NITHIIN FIANCE SHALINI REDDY FAMILY AND HERE THE STORY PK
నితిన్‌కు కాబోయే అత్తగారు చిరంజీవికి బాగా కావాల్సిన వాళ్లే..
నితిన్ చిరంజీవి షాలిని (nithiin shalini chiranjeevi)
Nithiin Marriage: అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికి నితిన్ పెళ్లైపోయేది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఈయన పెళ్లి వాయిదా పడింది. ఈయన చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని.
అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికి నితిన్ పెళ్లైపోయేది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఈయన పెళ్లి వాయిదా పడింది. ఈయన చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని. నిశ్చితార్థం అయిన రోజు నుంచి ఈమె వివరాలను గూగుల్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. అసలు ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చింది.. పైగా ప్రేమ వివాహం అంటున్నాడు అంటూ ఆరా తీస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందే కలవడం.. ఐదేళ్ల ప్రేమ.. ఇప్పుడు పెళ్లి ఇలా చాలా విశేషాలు చెప్పాడు నితిన్. ఈ మధ్యే మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటికి వచ్చింది. నితిన్ అత్తారింటికి చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయి.
నితిన్ చిరంజీవి షాలిని (nithiin shalini chiranjeevi)
షాలిని రెడ్డి కందుకూరి తెలంగాణలోని నాగర్ కర్నూల్ అమ్మాయి. అక్కడే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ కూతురు ఈ షాలిని. నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు. అక్కడ ఈ హాస్పిటల్‌కు మంచి పేరుంది కూడా. వీళ్లది కూడా ప్రేమ వివాహమే. ఇప్పుడు వాళ్ల కూతురుకు కూడా ఇదే చేస్తున్నారు. అయితే వీళ్లకు చిరుతో సాన్నిహిత్యం బాగానే ఉంది. అయితే అది కేవలం రాజకీయపరంగా మాత్రమే.
నితిన్ చిరంజీవి షాలిని (nithiin shalini chiranjeevi)
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు నాగర్ కర్నూల్ నుంచి నూర్జహాన్ ఎమ్మెల్యే టికెట్ అందుకున్నారు. పార్టీ పెట్టగానే అందులో చేరింది నూర్జహాన్. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి నూర్జహాన్ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ప్రజారాజ్యం సంగతి అందరికీ తెలుసు. ఆమె కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ నితిన్, షాలిని పెళ్లితో మరోసారి నూర్జహాన్ వార్తల్లోకి వచ్చారు. తీరా ఆమె ఈమె ఒక్కరే అని తెలిసిన తర్వాత అంతా ఆశ్చర్యపోతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.