Home /News /movies /

CHIRANJEEVI GOPICHAND AARADUGULA BULLET MOVIE RELEASE AFTER 4 YEARS THIS MOVIE COMPARE TO CHIRANJEEVI ANJI MOVIE HERE ARE THE DETAILS TA

Chiranjeevi - Gopichand : మెగాస్టార్ చిరంజీవి ఆ రికార్డును కొద్దిలో మిస్ అయిన గోపీచంద్..

చిరంజీవి,గోపీచంద్ (File/Photo)

చిరంజీవి,గోపీచంద్ (File/Photo)

Chiranjeevi - Gopichand : మెగాస్టార్ చిరంజీవి ఆ రికార్డును కొద్దిలో మిస్ అయిన గోపీచంద్.. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ లేని గోపీచంద్.. సీటీమార్‌తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇపుడు అదే ఊపులో

    Chiranjeevi - Gopichand : మెగాస్టార్ చిరంజీవి ఆ రికార్డును కొద్దిలో మిస్ అయిన గోపీచంద్.. వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్‌గా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. అపుడెపుడో  2017 జూన్ 9న విడుదల కావాల్సిన మూవీ ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్ కారణంగా .. నాలుగేళ్ల తర్వాత ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఏమైనా ఎన్నో పురిటి నొప్పుల తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక గోపీచంద్ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంజి’ సినిమా కూడా గ్రాఫిక్స్ ఇతరత్ర కారణాల వల్ల ఈ సినిమా 5 యేళ్ల తర్వాత విడుదలైంది. కానీ ‘అంజి’ సినిమా కథ బాగానే ఉన్నా.. ఎందుకో పెద్దగా నడవలేదు.

    ఈ సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రాఫిక్స్ చిత్రంగా అవార్డు అందుకుంది. అంతకు ముందు ఎన్టీఆర్ టైటిల్‌ రోల్లో బాలకృష్ణ ముఖ్యపాత్రలో నటించిన ‘శ్రీ మద్విరాట్ వీరబ్రహేంద్ర స్వామి చరిత్ర’  సినిమా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు షూటింగ్ కంప్లీటైంది. అప్పట్లో సెన్సార్ సభ్యుల కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అపుడు ఆ సినిమాను విడదలు చేయలేదు అన్న ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్‌గా తెలుగు దేశం పార్టీ స్థాపించడం.. ఆ తర్వాత సీఎం అయిన యేడాది తర్వాత 1984లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా యేడాదికి పైగా నడిచి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

    Hit Movie Remake Bollywood: అధికారికంగా ప్రారంభమైన ’హిట్’ హిందీ రీమేక్.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హంగామా..

    తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ కారణంగా 4 యేళ్ల తర్వాత విడుదలైంది. రీసెంట్‌గా గోపీచంద్ హీరోగా నటించిన  స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ (Seetimaarr)తో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించారు. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లనే సాధించింది.

    Nagarjuna - RamyaKrishna: బంగార్రాజు సహా నాగార్జున, రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా..

    ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. (Seetimaarr)  'సీటీమార్' కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది.

    Maa Elections - Prakash Raj : మా అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ పై సీనియర్ సభ్యుల అసహనం..

    ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా  (Tamannaah ) నటించారు. ఇక ’ఆరగడుగుల బుల్లెట్’ సినిమా అతి తక్కువగా రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aaradugula Bullet, Acharya, Chiranjeevi, Gopichand, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు