Home /News /movies /

CHIRANJEEVI GOING ABROAD FOR WALTAIR VEERAYYA HERE ARE THE DETAILS SR

Chiranjeevi : వాల్తేరు వీరయ్య కోసం పక్కదేశానికి వెళ్తోన్న చిరంజీవి..

Chiranjeevi  Photo : Twitter

Chiranjeevi Photo : Twitter

Chiranjeevi : చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినియాకు 'వాల్తేరు వీరయ్య' (waltair veerayya) టైటిల్ ఖరారు అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. చిరంజీవి సినిమాలో మత్స్య కారుడిగానే కాకుండా.. మత్స్య కారులకు నాయకుడిగా కనిపించనున్నారట.

ఇంకా చదవండి ...
    Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల 'ఆచార్య' (Acharya) సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత, మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి  నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్‌లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. థియేటర్ రన్ పూర్తవ్వడంతో ఈ సినిమా మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక అది అలా ఉంటే చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినియాకు 'వాల్తేరు వీరయ్య' (waltair veerayya) టైటిల్ ఖరారు అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. చిరంజీవి సినిమాలో మత్స్య కారుడిగానే కాకుండా.. మత్స్య కారులకు నాయకుడిగా కనిపించనున్నారట.

    తమ జీవితాలపై పెత్తనం, తమ మార్కెట్ పై ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడిగా చిరంజీవి కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మలేసియాలో చిత్రీకరించనున్నారట టీమ్. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ మలేసియా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

    Shruti Haasan in chiranjeevi, Chiranjeevi Bobby film update, Chiranjeevi Bobby film to launch, Chiranjeevi Acharya release date, Chiranjeevi bhola shankar update,tamannah finalised for bholaa shankar, Chiranjeevi lucifer remake shoot starts, Chiranjeevi lucifer remake titled as godfather, Chiranjeevi news,Chiranjeevi lucifer remake update, Vidya balan, Anushka, Chiranjeevi acharya, Chiranjeevi movies, Chiranjeevi latest news, Chiranjeevi acharya news, Chiranjeevi Koratala siva acharya update, చిరంజీవి, లూసిఫర్, చిరంజీవి భోళా శంకర్
    Shruti Haasan Chiranjeevi Photo : Twitter


    ఇక ఈ సినిమాలో చిరంజీవి ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు. చిరంజీవి సరసన అందాల భామ శృతి హాసన్ (Shruti Haasan) నటించన్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక చిరంజీవి ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను చేయనున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

    chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi god father movie shoot very fast,chiranjeevi god father shooting,chiranjeevi god father release date,telugu cinema,చిరంజీవి,చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా,చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదల తేదీ,చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ వేగం
     గాడ్ ఫాదర్ Photo : Twitter


    ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుంది.

    april 1st acharya movie release date,acharya movie new release date,acharya movie,acharya movie ram charan,chiranjeevi acharya movie,acharya movie release date,acharya movie nizam rights 42 crore warangal srinu,acharya movie pre release business,chiranjeevi acharya movie release date sarkaru vaari paata mahesh babu,acharya movie teaser reactions,telugu cinema,ఆచార్య,ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్,ఆచార్య కొత్త రిలీజ్ డేట్ ఎప్రిల్ 1,ఆచార్య నైజాం రైట్స్ 42 కోట్లు
     ఆచార్య Photo : Twitter


    ఈ రెండు సినిమాలతో వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్‌ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Chiranjeevi, Valteru Veerayya Movie

    తదుపరి వార్తలు