హోమ్ /వార్తలు /సినిమా /

God father Trailer: మెగా అంచనాలు రీచ్ అయ్యేలా బొమ్మ అదిరింది

God father Trailer: మెగా అంచనాలు రీచ్ అయ్యేలా బొమ్మ అదిరింది

God father trailer Photo Twitter

God father trailer Photo Twitter

Chiranjeevi: మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ (God Father) ట్రైలర్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 12 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ మెగా అభిమానులకు కిక్కిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ (God Father) ట్రైలర్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 12 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ మెగా అభిమానులకు కిక్కిస్తోంది. ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యేలా ఈ ట్రైలర్‌ కట్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి (Chiranjeevi) డైలాగ్స్‌తో అదరగొట్టేశారు. అక్టోబర్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

నేడు (సెప్టెంబర్ 28) అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ (God Father Pre Release Event) గ్రాండ్‌ గా జరుగుతోంది. ఈ వేదికపైనే గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ (God Father Trailer)ను లాంచ్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవి పదునైన డైలాగ్స్ మెగా అభిమానులకు కిక్కిస్తున్నాయి. ''నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు'' అంటూ చిరనేజీవి చెప్పిన డైలాగ్ మెగా ఫ్యాన్స్ ని హుషారెత్తిస్తోంది.

మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాత్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార (Nayanthara) ముఖ్య పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసీఫర్’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

భారీ రేంజ్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందుతున్న ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది.

సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లో కూడా అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడు గా గుర్తింపు ను తెచ్చుకున్న సత్య దేవ్ ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది.

Published by:Sunil Boddula
First published:

Tags: Chiranjeevi, God father, Tollywood

ఉత్తమ కథలు