హోమ్ /వార్తలు /సినిమా /

God Father Title Song: హైలైట్‌గా నిలిచిన చిరంజీవి ఎలివేషన్ సీన్స్

God Father Title Song: హైలైట్‌గా నిలిచిన చిరంజీవి ఎలివేషన్ సీన్స్

God Father (Photo Twitter)

God Father (Photo Twitter)

Chiranjeevi: తాజాగా విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రిలీజ్ చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా రాబోతున్న భారీ సినిమా గాడ్ ఫాదర్ (God Father). మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు మరో రెండు రోజుల సమయమే ఉండటంతో మెగా అభిమానుల్లో క్యూరియాసిటీ అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ (God Father Title Song) మరింతగా ఆకట్టుకుంది. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు చిరంజీవి ఎలివేషన్ సీన్స్ హైలైట్ అయ్యాయి.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్ లాంటి భారీ తారాగణం భాగమయ్యారు. మలయాళ చిత్రం లూసీఫర్ తెలుగు రీమేక్ గా భారీ హంగులు జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో అంతకుమించిన హిట్ సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు మేకర్స్.

‘ఆచార్య’ (Acharya) ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా విజయం సాధించడం మెగాస్టార్‌ చిరంజీవికి కీలకంగా మారింది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకున్నారట చిరు. చిత్ర ఫైనల్ కాపీ చూసిన చిరంజీవి చాలా హ్యాపీగా ఫీలయ్యానని చిరంజీవి అన్నారు.

సంగీత దర్శకుడు థమన్ కూడా ఈ పాట కోసం ప్రాణం పెట్టినట్లుగా సాంగ్ స్పష్టం చేస్తోంది. ‘గాడ్‌ఫాదర్’ టైటిల్‌ సాంగ్‌గా విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి లుక్ చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగమయ్యారని చెప్పి మెగా అభిమానుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశారు సల్మాన్ ఖాన్.

రీసెంట్ గా అనంతపురం జిల్లాలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. మెగా అభిమానుల కేరింతల నడుమ ఘనంగా ఈ ఈవెంట్ నడిచింది. ఈ వేడుకలో చిరంజీవి స్పీచ్ హైలైట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా సత్తా చాటింది గాడ్ ఫాదర్ మూవీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 90 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని రంగంలోకి దిగుతున్నారు ఈ గాడ్ ఫాదర్.

Published by:Sunil Boddula
First published:

Tags: Chiranjeevi, God father, Tollywood

ఉత్తమ కథలు