హోమ్ /వార్తలు /సినిమా /

God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ నుంచి ‘తార్ మార్’ ఫుల్ సాంగ్ రిలీజ్...!

God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ నుంచి ‘తార్ మార్’ ఫుల్ సాంగ్ రిలీజ్...!

గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ పూర్తి కాలేదా (Twitter/Photo)

గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ పూర్తి కాలేదా (Twitter/Photo)

తాజాగా విడుదలైన ఈ సాంగ్‌లో మేకింగ్ విజువల్స్ కూడా రిలీజ్ చేసింది గాడ్ ఫాదర్ టీం. ఈ విజువల్స్‌లో సాంగ్ మేకింగ్ స్టిల్స్‌ను కూడా మనం చూడవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీ తొలి పాట ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ లిరికల్‌ పాటను చిత్ర యూనిట్‌ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ పాటను చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లపై చిత్రీకరించారు. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్‌ పాడగా... తమన్‌ సంగీతం అందించారు.  ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. మో హన్‌రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మలయాళ చిత్రం ‘లూసీఫర్‌’కు రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబరు 5న ఈ చిత్రం విడుదల కానుంది.

  తాజాగా విడుదలైన ఈ సాంగ్‌లో మేకింగ్ విజువల్స్‌న కూడా యాడ్ చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్, చిరంజీవి సందడి చూడొచ్చు. అలాగే ప్రభుదేవా డాన్స్ స్టెప్స్ నేర్పిస్తున్న విజువల్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి కూతురు సుస్మిత కూడా కనిపించారు. ఇలా ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ చేసారు. ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు.

  గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి తన వయసుకు తగ్గ పాత్రలో నటించారు.  మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి తనకు అచ్చొన్చిన ఖైదీ పాత్రలో కనిపంచబోతున్నారు. గతంలో వచ్చిన ‘ఖైదీ, ‘ఖైదీ నంబర్ 786’, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, ఖైదీ నంబర్ 150 సినిమాలు సక్సెస్ అయ్యాయి. అదే కోవలో ఖైదీ గెటప్‌లో చిరంజీవి కనిపించనున్న ఈ సినిమా సెంటిమెంట్ ప్రకారం బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలున్నాయని అభిమానులు అపుడే లెక్కలు వేసుకుంటున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Chiranjeevi, God father, Salman khan

  ఉత్తమ కథలు