Home /News /movies /

CHIRANJEEVI GOD FATHER RAMYA KRISHNA WILL PLAY CHIRANJEEVI SISTER CHARECTER IN GOD FAHTER MOVIE HERE ARE THE DETAILS TA

Chiranjeevi - God Father : ‘గాడ్ ఫాదర్’లో మరోసారి చిరంజీవి చెల్లెలు పాత్రలో ఆ స్టార్ హీరోయిన్..

‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి (Twitter/Photo)

‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi - God Father | మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం సీనియర్ హీరోయిన్‌ను అనుకుంటున్నారు.

    మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమా మలయాలంలో సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

    మాతృకలో వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) పోషించిన బాబీ పాత్రలో బిజు మీనన్ బాబీ నటించనున్నాడట. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ీ సినిమాలో ముందుగా విద్యాబాలన్‌ను చిరు చెల్లెలు పాత్ర కోసం అనుకున్నారు. తాజాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

    బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

    సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ వరుసగా డిఫరెంట్ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. బాహుబలిలో శివగామిగా అలరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు చిత్రాలున్నాయి. ‘లైగర్’, ’రంగమార్తాండ’, రిపబ్లిక్, బంగార్రాజు సహా పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. తాాజగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో రమ్యకృష్ణ .. చిరు చెల్లెలుగా కీలక పాత్రలో అలరించనుంది.

    చిరంజీవి, రమ్యకృష్ణ (Twitter/Photo)


    గతంలో రమ్యకృష్ణ .. చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘అల్లుడా మజాకా’, ‘ఇద్దరు మిత్రులు’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత చిరుకు చెల్లెలు పాత్రలో కనిపించనుంది.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    గతంలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది.  ఇపుడు చిరంజీవి హీరోగా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో వస్తోన్న రెండో సినిమా.‘గాడ్ ఫాదర్’ సినిమాలో మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు.

    చిరంజీవి, రమ్యకృష్ణ (Twitter/Photo)


    ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం.మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన అప్‌డేట్ చూసి మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, God Father Movie, Mohan Raja, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు