చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్ (God Father). మలయాళ చిత్రం లూసీఫర్ (Lucifer) రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాత్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) ముఖ్య పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
భారీ రేంజ్ లో తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రూపొందుతున్న ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం యూనిట్ అంతా రాయలసీమ వెళ్ళడానికి రెడీ అవుతోంది. అనంతపురం జిల్లాలో 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ నెల 28న ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం. తాజాగా ఈ ఈవెంట్ కోసం సర్వం సిద్ధం చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారీ ఎత్తున జరగబోతున్న ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
Venue Confirmed ???? Arrangements are On ✅ MEGASTAR ???? #Chiranjeevi garu’s #GodFather Pre Rlse Event at ananthapur GovernmentJuniorCollege Grounds???? Get ready to witness Boss of Masses #Megastar @KChiruTweets ‘s Euphoria at Ananthpur????????#MegastarChiranjeevi #GodFatherOnOct5th pic.twitter.com/EaM92BPBFA
— SivaCherry (@sivacherry9) September 19, 2022
ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటిస్తోంది. చిత్రంలో ఆమె క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉండనుందని టాక్. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ లో చిరంజీవి రఫ్‌లుక్‌తో మెగా లోకాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్‌కు తగ్గ పాత్రలో నటించారు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రను చిరంజీవి, పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, God father, Nayanatara