హోమ్ /వార్తలు /సినిమా /

God Father - Nayanthara : చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లేటెస్ట్ అప్‌డేట్.. నయనతార కీలక షెడ్యూల్ పూర్తి..

God Father - Nayanthara : చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లేటెస్ట్ అప్‌డేట్.. నయనతార కీలక షెడ్యూల్ పూర్తి..

‘గాడ్ ఫాదర్’ మూవీలో నయనతార కీలక షెడ్యూల్ పూర్తి (Twitter/Photo)

‘గాడ్ ఫాదర్’ మూవీలో నయనతార కీలక షెడ్యూల్ పూర్తి (Twitter/Photo)

Nayanthara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాలో నయనతార మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నయనతార పాత్రకు సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తైయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

  Nayanthara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాలో నయనతార మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నయనతార చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఇక మోహన్‌లాల్ (Mohanlal) ఒరిజినల్ ‘లూసీఫర్’ లో హీరోయిన్ లేదు. మరి తెలుగులో చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు కథానాయికగా రోల్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, నయనతార మరోసారి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఈ సినిమాలో తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించబోతున్నారు.

  ఈ చిత్రంలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 29న  విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో రెండు భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

  Chiranjeevi - Balakrishna - Jr NTR - Ram Charan : చిరంజీవి టూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ టూ రామ్ చరణ్ అందరి చూపు దాని వైపే..

  చిరంజీవి  ఆచార్య’ తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ రీమేక్ స్టార్ట్ చేసారు. ఈ సినిమా ఓ షెడ్యూల్ ఊటీలో పూర్తైయింది. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తోన్న  ఈ చిత్రాన్ని ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరగుతోంది. తాజాగా ఈ సినిమాకు నయనతారకు సంబంధించిన షెడ్యూల్ పూర్తైయినట్టు చిత్ర దర్శకుడు మోహన్ రాజా తెలిపారు. నయనతారకు తనకు ఇది మూడో చిత్రమని పేర్కొన్నారు.

  ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలో సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన షూట్ త్వరలోనే చేయనున్నారు. మరోవైపు చిరు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ డైరెక్షన్‌లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా.ఇప్పటికే ‘భోళా శంకర్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రవితేజ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Chiranjeevi, God father, Nayanthara, Tollywood

  ఉత్తమ కథలు