హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi - God Father : గాడ్ ఫాదర్‌లో చిరంజీవి చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ ఖరారు.. ?

Chiranjeevi - God Father : గాడ్ ఫాదర్‌లో చిరంజీవి చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ ఖరారు.. ?

 చిరంజీవి చెల్లెలు రమ్యకృష్ణ (Twitter/Photo)

చిరంజీవి చెల్లెలు రమ్యకృష్ణ (Twitter/Photo)

Chiranjeevi - God Father :మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ  ‘గాడ్ ఫాదర్‌’ ఇప్పటికే ఊటీలో ఈ సినిమా  ఓ షెడ్యూల్ కంప్లీటైంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో రమ్యకృష్ణ ఖరారైనట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

Chiranjeevi - God Father :మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ  ‘గాడ్ ఫాదర్‌’ ఇప్పటికే ఊటీలో ఈ సినిమా  ఓ షెడ్యూల్ కంప్లీటైంది. ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు ఆమె చెల్లెలు క్యారెక్టర్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ సినిమాలో చిరు చెల్లెలు పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ పేర్లే పరిశీలించినా.. ఫైనల్‌గా రమ్యకృష్ణను ఈ సినిమాలో  చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.‘గాడ్ ఫాదర్’ సినిమా మలయాలంలో సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సూపర్ గుడ్ ఫిల్మ్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.  చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ  సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించడానికి ఓకే చెప్పిన రమ్యకృష్ణ(Ramya Krishna) విషయానికొస్తే..  సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈమె వరుసగా డిఫరెంట్ పాత్రలు చేస్తూ దూసుకుపోతుంది. బాహుబలిలో శివగామిగా అలరించింది. రీసెంట్‌గా ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ చిత్రల్లో రమ్యకృష్ణ అదరగొట్టింది.  ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.  ‘లైగర్’, ’రంగమార్తాండ’, బంగార్రాజు సహా పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. తాాజగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘గాడ్‌ఫాదర్’(God Father) చిత్రంలో రమ్యకృష్ణ .. చిరు చెల్లెలుగా కీలక పాత్రలో అలరించనుంది.

చిరంజీవి, రమ్యకృష్ణ (Twitter/Photo)

గతంలో రమ్యకృష్ణ .. చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’ సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘అల్లుడా మజాకా’, ‘ఇద్దరు మిత్రులు’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఇపుడు చాలా యేళ్ల తర్వాత చిరుకు చెల్లెలు పాత్రలో కనిపించనుంది.

Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

గతంలో తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ హీరోలుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది.  ఇపుడు చిరంజీవి హీరోగా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో వస్తోన్న రెండో సినిమా.‘గాడ్ ఫాదర్’ సినిమాలో మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నారు.

చిరంజీవి, రమ్యకృష్ణ (Twitter/Photo)

ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్టు తమన్ రీసెంట్‌గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.  మరోవైపు వరుణ్ తేజ్.. చిరంజీవి బ్రదర్ పాత్రలో సీఎంగా కాసేపు అలరించనున్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన ఆచార్య వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మరోవైపు చిరు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, బాబీ డైరెక్షన్‌లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: Chiranjeevi, God Father Movie, Mohan Raja, Ramya Krishna, Super Good Films, Tollywood

ఉత్తమ కథలు